విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ:ఆస్తమా రోగులకు సంజీవనీలాగా ఆల్కెమ్ ఇన్ హెల్లర్ ఉపయోగపడుతుందని క్యాపిటల్ హాస్పిటల్ సీనియర్ పల్మానోలోజిస్ట్ డాక్టర్ సాగర్ తెలిపారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ సాగర్ వివరించారు.ఇండియాలో 50శాతం మంది 45సంవత్సరాలు పైబడిన వారు ఆస్తమా కు సరియైన చికిత్సకు అవగాహన లేక ఎంతోమంది చనిపోతున్నారని అన్నారు.ఆస్తమాతో చనిపోయో వారి సంఖ్య ప్రపంచంలో భారతదేశమే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. భారతదేశంలో ఎక్కువుగా డ్రై పౌడర్ ఇన్ హెలర్ ను అత్యధికంగా ఆస్తమా రోగులు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ఆస్తమా వ్యాధి మీద రోగులకు సరియైన అవగాహన లేక, ఆస్తమా కు ఏ ఇన్ హెల్లర్ మందు వాడాలో తెలియక చాలా మంది వ్యాధిని ముదరపెట్టుకుంటున్నారని తెలిపారు. ఆస్తమా కు ఆల్కెమ్ అను మెడికల్ కంపెనీ మొదటి ఇన్ హెల్లర్ పరికరమును ప్రారంభించడం జరిగిందని, ఈ ఇన్ హెల్లర్ ను చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చని దీని వాడకం ద్వారా ఆస్తమా రోగులకు ఉపసమనం లభిస్తుందన్నారు.ఆల్కెమ్ పరికరం వాడటం వలన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారికి త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో ఆల్కెమ్ కంపెనీ మార్కెటింగ్ సిబ్బంది దుర్గా కిషోర్ నాదెండ్ల, ఉస్మాన్ మహమ్మద్, సాతులూరి తేజ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ …