విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరుణ, సేవాతత్పరత, సుహృద్భావానికి రంజాన్ పండుగ ప్రతీక అని మైనార్టీ నాయకులు, సామాజికవేత్త, ఏ-1 సర్వీసెస్ అధినేత అమీన్ భాయ్ అన్నారు. ఈ సంధర్భంగా అమీన్ భాయ్ మాట్లాడుతూ ముస్లింల జీవితంలో రంజాన్ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ఆకలి తెలుసుకోవడమే రంజాన్ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం అని, పేదవారికి చేతనైనంతలో సాయం చేసే అవకాశం కల్పించినందుకు అల్లా కు రుణపడి ఉంటానని తెలిపారు. ప్రతి సంవత్సరం లానే ఈ పండుగ రోజు కుడా ఉచిత బట్టలు పంచె కార్యక్రమం జరిగినందు కు చాల సంతోషం గా ఉందన్నారు. మే డే మరియు రంజాన్ పండుగ సందర్బంగా సుమారు 500 మంది కార్మికులకు కొత్త బట్టలు మరియు స్వీట్ బాక్స్ లు అందించామన్నారు. ఈద్ పర్వదినం సంధర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Tags vijayawada
Check Also
సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలని, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను …