-డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డీకే బాలాజీ, ఐఏఎస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.10.01.2025 శుక్రవరం ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని శ్రీలంక కాలనీ లో గల NAC ట్రైనింగ్ సెంటర్ నందు మరియు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డీకే బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు.
ఈ జాబ్ మేళాలో, వివిధ ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఆయొక్క కంపెనీలలో గల ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 30 సంవత్సరాల లోపు వారు అర్హులని, అభ్యర్థుల యొక్క గత పని అనుభవాన్ని బట్టి ఆసక్తికర వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, జనవరి 10 న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు గారు మరియు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్ తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు ఉయ్యూరు – 79813 68429, గన్నవరం – 94940 05725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News