విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ మరియు వై.యన్.ఆర్. చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కు చెందిన పచ్చిగోళ్ళ రమేష్, రాయల శౌభాగ్యవతిల కుమార్తె ఉన్నత చదువుల నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ మరియు యలమంచిలి జయ వైయన్ఆర్ చారిటీస్ ద్వారా 30000 రూపాయల నగదును దేవినేని అవినాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాన్న దేవినేని నెహ్రు సేవా స్పూర్తితో మా చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలుస్తున్నాం అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరుపుతామని నా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు చిత్రం లోకేష్, వొగ్గు విఠల్, రామస్వామి, చోదేష్, బాలరాజు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …