-నీటి ప్రవాహం లేని ప్రాంతాలలో యాంటి లార్వా ఆపరేషన్ పనులు చేపటి దోమల లార్వా నిర్మూలించాలి
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా బుధవారం 21వ డివిజన్ పరిధిలోని కృష్ణలంక, బర్మా సీతారామయ్య స్కూల్ రోడ్, గుంటూరు వారి వీధి, మెట్ల బజార్ మరియు కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో పర్యటిస్తూ, స్థానికంగా ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులు మరియు పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. గుంటూరు వారి వీధిలో ఎస్.ఎస్ టవర్స్ వద్దన గల ట్రాన్స్ ఫారం దగ్గర పబ్లిక్ చెత్త వేయుట గమనించి అధికారులకు పలు సూచనలు చేస్తూ, స్థానికంగా అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకొనేలా చూడాలని అన్నారు. మెట్ల బజార్ నందు స్థానికులు వీధి దీపాలు సరిగా వేలుగడం లేదని తెలిపిన దానిపై తక్షణమే స్పందిస్తూ, యుద్దప్రాతిపదికన వాటికి తగిన మరమ్మత్తులు నిర్వహించాలని మరియు బర్మా సీతారామయ్య స్కూల్ రోడ్ నందలి అనధికార ఆక్రమణలను తక్షణమే తొలగించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. తదుపరి మెట్ల బజార్ చివర కృష్ణ నది పరివాహక ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో నది ఒడ్డున అక్కడక్కడ గల నీటి నిల్వలలో దోమల లార్వా వృద్దికి అవాసాలుగా ఉండి దోమల సమస్య అధికంగా ఉందని స్థానిక కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా ఆయా ప్రాంతాన్ని పరిశీలించి దోమల లార్వా వృద్ది చెందకుండా నీటి గుంటలలో యాంటి లర్వాల్ ఆపరేషన్ పనులు నిర్వహించి లార్వా దశలోనే నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలి. అదే విధంగా ఆయా ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ తీరు, డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల విధానము, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల మరియు ఇంటింటి చెత్త సేకరణ విధానం మొదలగు అంశాలను పరిశీలించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, రోడ్లపై లేదా డ్రెయిన్ లలో ఎవరు చెత్త మరియ వ్యర్ధములు పారవేయకూడా చూడాలని ప్రజారోగ్య అధికారులను అదీశించారు. పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతబాయి, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.