-18వ డివిజన్లో మంచినీటి పైపులైన్ల ఆధునీకరణ, పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18 డివిజన్ నందు రూ. 70 లక్షలతో పైపులైన్ ఏర్పాటుకు మరియు రూ.19.11లక్షల అంచనాలతో రాణిగారి తోట సిమెంట్ గోడౌన్ వద్ద పార్క్ అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తదితరులు పాల్గొని భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరాభివృధియే లక్ష్యంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా నేడు 18వ డివిజన్ రాణిగారి తోట యందు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాంతములో సుమారు రూ.19.11లక్షల వ్యయంతో పార్క్ గా తిర్చిదిద్దుట జరుగుతుందని అన్నారు. అదే విధంగా ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన మంచినీటి పైపులైన్ పాడైపోవుట కారణంగా ప్రజలకు ఎదురౌతున్న త్రాగునీటి ఇబ్బందులను తొలగించుటకు గాను పాడైన పాత పైపుల స్థానములో కొత్త పైపులు వేయుటం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికై సుమారు రూ.70 ఖర్చు చేయుట జరుగుతుందని వివరిస్తూ, నగరపాలక సంస్థ పరిధిలోని 64 డివిజన్లలో మంచినీటి సరఫరా విధానములో ఏర్పడు ఇబ్బందులను పరిష్కరించుటకై అమృత్ నిధుల ద్వారా ప్రతి డివిజన్ అవసరానికి అనుగుణంగా నిధులు కేటాయించుట జరిగిందని వివరించారు. ఇప్పటికే నగర పరిధిలో అనేక పార్కుల ఆధునీకరణ మరియు రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుదలకు చర్యలు తీసుకోవటం జరిగిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరపాలక సంస్థ అవసరమైన అన్ని పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని వివరించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో దేవినేని అవినాష్ అద్వర్యంలో ఎన్నడు జరగని అభివృద్ధి జరిగిందని, అవినాష్ నాయకత్వంలో ఇటివల కాలంలో అనేక పనులకు శ్రీకారం చుట్టి, వాటికీ సంబందించిన పనులు వేగవంతముగా జరుగుతున్నవని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని అన్నారు.
నిరూపయోగంగా ఉన్న స్థానము నందు పార్క్ అభివృద్ధి…
కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,
రాణిగారి తోట, సిమెంట్ గోడౌన్ వద్ద నిరుపయోగంగా ఉన్న షెడ్ లను తొలగించి అక్కడ ప్రజలకు ఆహ్లాదం కల్పించే పార్క్ గా తిర్చిదిద్దుట జరుగుతుందని, దీనిలో గ్రీనరితో పాటుగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల అతపరికారాలు వంటి సౌకర్యాలు నిల్పిస్తున్నట్లు కమిషనర్ వివరించారు. కార్యక్రమములో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చంద్రశేఖర్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు పలువురు అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.