విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్ గుండు కోటయ్య విధి,పాలపత్తి వారి వీధి ప్రాంతంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్, స్థానిక కార్పొరేటర్ అడపా శేషు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లిన అవినాష్ సంక్షేమ పథకాలు అమలు తీరును,చేస్తున్న అభివృద్ధి ని ప్రజలకు వివరించారు. అవినాష్ మాట్లాడుతూ రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపతిన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో వ్యక్తమవుతున్న స్పందన చూస్తుంటే వారి నాయకత్వం లో పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అని అన్నారు.రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని, రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ్, షేక్ సుభాని,పల్లెం రవి,విజయలక్ష్మి,ఎన్.ఎస్.రాజు,రఫీ,జోగా రాజు,గల్లా రవి,కార్పొరేటర్లు రామిరెడ్డి,కొండారెడ్డి,గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగారాజు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …