మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీ , 8 వ తేదీన గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసన సభ్యులు, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళా గురించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల భారీ జాబ్ మేళాలు నిర్వహిస్తున్న విషయం అందరికి విదితమేనని అన్నారు. తాజాగా మరో భారీ జాబ్ మేళా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 7, 8వ తేదీల్లో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా జరుగుతుందని అందులో పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి ఉద్యోగాలిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే పేర్ని నాని ఆవిష్కరించారు. ఇప్పటికి మన రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలో జరిగిన రెండు మెగా జాబ్ మేళా విజయవంతం అయ్యాయని ఆ రెండు ప్రాంతాలలో సుమారు 30 వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడినట్లు ఆయన వివరించారు.మే 7 వ తేదీ , 8 వ తేదీన గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే మెగా జాబ్ మేళాలో జాబ్మేళాలో 80 కంపెనీలు పాల్గొంటున్నాయని మన ప్రాంతంలోని నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ జాబ్ మేళాలో హెచ్ సి ఎల్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు , హీరో , హెటేరో, అపోలో ఫార్మసి, అవని టెక్నాలజీ సొల్యూషన్స్ , ఆక్సిస్ బ్యాంకు, భరత్ ఎఫ్ ఐ హెచ్ , బిగ్ బాస్కెట్ , బైజూస్ , సెరియం కోజెంట్ , డిక్సన్ తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అయితే ఈ జాబ్ మేళాకు బాపట్ల, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, నర్సారావుపేట, నర్సాపురం, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు చెందిన నిరుద్యోగులు మాత్రమే హాజరుకావాల్సి ఉందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://ysrcpjobmela.com/ ను ఓపెన్ చేయాలి.అనంతరం Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, పార్లమెంట్ నియోజకవర్గం, విద్యార్హత, ఫుల్ అడ్రస్ ను నమోదు చేసి Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలని ఎమ్మెల్యే పేర్ని నాని వివరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మచిలీపట్నం మాజీ జడ్పిటీసీ సభ్యులు లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వియార్ ) , మాడపాటి వెంకటేశ్వరరావు, శీలం బాబ్జి, శొంఠి ఫరీద్, మహమ్మద్ రఫీ, కో- ఆప్షన్ సబ్యడు బేతపూడి రవి, మరీదు నాగరాజు, తిరుమలశెట్టి ప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మణ్, వైస్సార్ సి పి సోషల్ మీడియా ప్రతినిధులు పుప్పాల పవన్, అంబటి పవన్ తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …