-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల పనులను ఎప్పకప్పుడు సమీక్షించుకుని పురోగతిని సాధించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత అధికారులు ఆదేశించారు. గురువారం సచివాలయం నుండి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ గోపాల కృష్ణ ద్వివేది రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతి పై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్‌టిఆర్ జిల్లా నుండి జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ పొల్గొన్నారు. అనంతరం వీడియోకాన్ఫరెన్స్‌కు హాజరైన అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎస్) లో చేపట్టిన పనులను, జగనన్న స్వచ్ఛ సంకల్పం, భవనాల నిర్మాణాల ప్రాధాన్యత, ఆర్‌డబ్ల్యుఎస్‌లో చేపట్టిన పనులలో ఎప్పటికప్పుడు పురోగతిని సాధించాలన్నారు. ఉపాధి హామి పథకం పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఏపివో అందుబాటులో లేకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. మార్కింగ్, పనిదినాల మస్తర్ పై ప్రత్యేక దృష్టి సాధించి ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్ పనుల్లో వారం వారానికి వృద్ది రేటు పెంచేలా పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డ్వామా పిడి యం జనార్థన్, హౌసింగ్ అధికారులు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పాల్గొన్నారు.