విజయవాడ పశ్చిమ మండలంలో ఇళ్ల పట్టాల సమస్యలను త్వరలో పరిష్కరించేలా చర్యలు

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పశ్చిమ మండలంలో ఇళ్ల పట్టాల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. పశ్చిమ మండలానికి సంబంధించి ఇళ్ల పట్టాల సమస్యపై మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం కలెక్టరేట్‌ నందు జిల్లా కలెక్టర్‌తో సమావేశమై ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పశ్చిమ మండలంలోని కరకట్ట ప్రాంతంలో ఇరిగేషన్‌ స్థలంలో 1995లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం లబ్ధిదారుల నుండి చేతుల మారి వేరే వారు నివాసం వుంటున్నారన్నారు. నివాసం వుంటున్నవారి పేరున ఇళ్ల పట్టాలు లేక పలు ఇబ్బందులు పడుతున్నరని వారి పేరున ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరారు. అలాగే స్వాతి థియేటర్‌ రోడ్డులో ఉన్న ఆనాధినంలో ఉన్న భూమిని నిషేదిత జాబితా నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సితార సెంటర్‌ సమీపంలోని లేబర్‌ కాలనీలో కొన్ని సర్వే నెంబర్‌ నిషేదిత భూములుగా చూపించడం వలన రిజిస్ట్రేషన్లు కావాడం లేదని ఉర్మిళ సుబ్బారావు నగర్‌ ఇళ్లు రిజిస్ట్రేషన్‌ జరిగేలా అనుమతిని ఇవ్వాలని జగనన్న కాలనీలలో పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు నీటి పన్ను ఇంటి పన్ను వసూలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు.
కలెక్టర్‌ దీనిపై స్పందిస్తూ స్వాతి థియేటర్‌ రోడ్డులో ఆనాధినంలో ఉన్న భూములు సెక్షన్‌ 22ఏ పరిధిలోనికి వస్తాయని వాటిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి త్వరలో సమర్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కరకట్ట ప్రాంతంలో భూముల పట్టాల సమస్యలతో పాటు తన పరిధిలో ఉన్న మిగిలిన సమస్యలను స్థానిక సబ్‌ కలెక్టర్‌ పరిధిలో కమిటి మరియు జిల్లా కలెక్టర్‌ పరిధిలోని కమిటిలతో సమావేశం నిర్వహించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు రుహుల్లా, కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, కోటిరెడ్డి, చైతన్యరెడ్డి, యండి ఇర్ఫాన్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిటీ ప్లానర్‌ ప్రసాద్‌, పశ్చిమ మండల తహాశీల్థార్‌ టి. మధురి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *