-మద్యపానం వలన అనర్థాలు ప్రజలను వివరించి చైతన్యవంతులను చేయండి
-విద్యార్థులకు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మద్యపానం మత్తుపానీయాలు సేవించడం ద్వారా ఎదురయ్యే అనర్థాలను ప్రజలకు వివరించి వ్యసనాలకు దూరంగా ఉంచడం ద్వారా మద్యపానరహిత సమాజ ఏర్పాట్లలో ప్రతీ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మద్యవిమోచన ప్రచార కమిటి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని కానూరు వద్ద గల వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన మద్య విమోచన కళాజాత ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై కళాజాతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తుపానీయాల సేవించడం ద్వారా కలిగే ఆనారోగ్యాల బారిన పడటమే కాకుండా ఎన్నో కుటుంబాలు చిన్నాభినమైన సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నామన్నారు. మహాత్మాగాంధీజి కళలు కన్న మద్యరహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నపట్టికి ప్రజల పూర్తి భాగ్యస్వామ్యం ఉన్నపుడే అది సాధ్యపడుతుందన్నారు. మద్యపానం అన్ని సమస్యలకు కేంద్రబిందువు అని తెలిసినప్పటికి వ్యసనాన్ని ఆరికట్టలేకపోతున్నామన్నారు.చిన్నతనం నుండే విద్యార్థులకు మద్యపానం మత్తుపదార్ధాల వలన కలిగే ఆనర్థాల గురించి అవగాహన కల్పించేందుకు కళాజాతలు ఎంతో దోహదపడతాయన్నారు. మద్య విమోచన ప్రచార కమిటి అన్ని కళాశాలలో ఇటివంటి కళాజాతలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా కొత్త మేరకు మద్యపానం అరికట్టడంలో మంచి ఫలితాలను తీసుకురాగలుగుతామన్నారు. యువత మత్తుపానియాలకు దూరంగా వుండి చదువుపై ఏకాగ్రత పెట్టి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కలెక్టర్ కోరారు. నాటుసారా, గంజాయి, డ్రగ్స్, ఆక్రమ మద్యం వంటి వాటిని నివారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫీ నెంబర్ 14500 కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ విద్యార్ధులను కోరారు.
శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ స్వాంతంత్ర ఉద్యమంలో మహాత్మగాంధీ మద్యపానానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడారన్నారు. ఆయన కలలను నిజం చేయాల్సిన భాధ్యత నేటి యువతపై ఉందన్నారు. శాసన మండలి సభ్యులు కె ఎస్ లక్ష్యణరావు మాట్లాడుతూ విద్యార్థులు మత్తుపానీయాలకు దూరంగా వుండి ఉన్నత విద్యను అభ్యశించి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని కోరారు. విద్యార్థులో చైతన్యం తీసుకువచ్చేందుకు మద్య విమోచన ప్రచార కమిటి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
మద్య విమోచన ప్రచార కమిటి రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ యుక్త వయస్సులోనే మద్యానికి బానిసలై వ్యసనపరులుగా మారి అనేక అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారన్నారు. అలాటి వారికి డి`అడిక్షన్ కేంద్రాల ద్వారా ఉచిత వైద్యం పొందేటట్లు విద్యార్థు కృషి చేయాలన్నారు. 10 మంది కళాకారులతో కూడిన కళాజాతర ఆటపాటలతో వివిధ కళారూపాల ద్వారా రాష్ట్రంలోని అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్, కళాశాలలో, యూనివర్సిటిలలో కళాజాతలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు.
అనంతరం మద్యవిమోచన కమిటి ప్రతినిధులు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావును దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎబి రత్నప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ కో`ఆర్డినేటర్ కె నరేంద్ర, ఫ్రొఫిసర్ పాండురంగరావు, అసిస్టెంట్ ఫ్రొఫీ˜ిసర్ మాధవి, డిప్యూటి కమిషనర్ స్పెషల్ ఎన్‌న్ఫోర్స్మెంట్ బ్యూరో యం శ్రీనివాస్‌రావు, ప్రజా సంస్కృతిక వేదిక బృందం ఇన్‌చార్జి టి రాజేష్ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.