రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్, స్పందన, మ్యూటేషన్, ఎక్సైజ్, సచివాలయ తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై అధికారులు దృష్టి పెట్టడం ద్వారా వారంవారం లక్ష్యాలను నిర్దేశించి ప్రతి రోజూ ప్రభుత్వ లక్ష్యాలు మేరకు క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. . స్పందన ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం వాస్తవ పరిస్థితిని ఫిర్యాదుదారులకు తెలియ పరిచడం జరుగుతోందన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. మ్యూటేషన్స్, జగనన్న లే అవుట్ , ఓటీఎస్, ఇండ్ల నిర్మాణాలు పై రోజు వారి లక్ష్యాలతో పనులు పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మ్యూటేషన్స్ కి సంబంధించిన సహేతుకమైన కారణం లేకుండా దరఖాస్తులు పెండింగులో ఉండరాదని తహశీల్దార్లు కి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. సచివాలయ, అర్భికే, హెల్త్ క్లినిక్ భవనాలు, గ్రామ, వార్డు సచివాలయ తనిఖీలు పై సి ఎస్ సమీక్షించారు. సి ఎస్. వీసి లో డిఆర్వో బి.సుబ్బారావు, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జిల్లా హౌసింగ్ అధికారి బి. తారాచంద్, సీపీఓ కార్యాలయ ఎస్ ఓ శ్రీనివాస్, ఎక్సైజ్ సి ఐ ఆర్.సి.హెచ్ చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …