-పరీక్షలు అనంతరం అత్యంత జాగ్రతగా జవాబు పత్రాలు తరలింపు
– కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 5వ రోజు సైన్స్ లు (సామాజిక శాస్త్రం) పరీక్షకి 23,946 మంది హాజరు కావాలసి ఉండగా, 23,706 (99 %) మంది హాజరైనట్లు 240 మంది హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత గురువారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత వివరాలు తెలుపుతూ జిల్లాలో ఈ రోజు జరిగిన సామాజిక శాస్త్రం (నాచురల్ సైన్స్) పరీక్షలకి 23,706 మంది హజరయ్యారని, 240 ( ఒక శాతం) మంది గైరాజరు అయినట్లు ఆమె తెలిపారు. పదవ తరగతి పరీక్షలు అనంతరం అత్యంత పకడ్బందీగా జవాబు పత్రాలను భద్రతా కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేయ్యాడం జరుగుతోందని డీఈఓ అబ్రహం కలెక్టరుకి వివరించారు. జిల్లా కలెక్టర్ వారి సూచనలు మేరకు అత్యంత పక్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జవాబు పత్రాలను కాకినాడ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో దిద్దడానికి రాష్ట్ర విద్యా శాఖ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. అంతకు ముందు జిల్లా విద్యా శాఖాధికారి ఎస్. అబ్రహం గోకవరం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ ను తనిఖీ చేశారు.