విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అరవైఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటూఎండపల్లి పంచాయతీ సర్వే నంబర్ల627/1,627/2,628/1,628/2 కి 52ఏళ్లుగా పన్నులు చెల్లించుకుని జీవనం సాగిస్తున్నామని స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎండపల్లి గ్రామానికి చెందిన దాకే సింహచలం మాట్లాడుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్. వి. ఎస్. ఎన్. వర్మ, ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబు లు మా భూములపై కన్ను వేసి, రిటైర్డ్ తహసీల్దార్ కర్నీడి రత్నకుమారి ఆడంగల్ మార్పులు చెయ్యగా, ప్రస్తుత తహసీల్దార్ ఎల్.శివకుమార్ భూముల పొజిషన్ లో మేము లేమని తప్పుడు నివేదికలు ఇచ్చి, రికార్డులు తారుమారు చేసి రైతులని నిలువునా మోసం చేశారని, బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆయన అన్నారు. ఈ భూములను నమ్ముకుని బ్రతుకుతున్న మాకు ఈ భూములు కోల్పోతే చావే శరణ్యం అని మా భూముల్లో 300కుటుంబాలు సాగుచేసుకుంటుంన్నప్పటికీ తహసీల్దార్ శివకుమార్ తప్పుడునివేదికలు ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఒత్తిడితో ప్రభుత్వానికి పంపించి బాధిత రైతులకు అన్యాయం చేశారని , వరి పంట పండిన గాని కోత కోసుకొనియకుండా మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం కార్యకర్తలతో అడ్డుతగులుతున్నారని, మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన భూముల బాధిత రైతులు విజయవాడ లో రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కి వినతిపత్రం అందజేశామని , తమకు న్యాయం చేయాలని బాధిత ఎస్సీ, బీసీ, ఓసీ లకు చెందిన వ్యవసాయ కూలీలకు న్యాయం జరగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొంగు లోవరాజు, కొంగు నాగరాజు, పులపకూరి రాజు, దాకే సింహాచలం, కొలగంటి రాజు, కోట వెంకటరమణ, బిళ్ళకుర్తి రాంబాబు, తమిలిశెట్టి సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు నగరంలో సింగిల్ యూస్ …