విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని,గెలుపోటములతో సంబంధం లేకుండా అంతటా సమ అభివృద్ధి జరగాలి అనేదే జగన్ లక్ష్యం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం నాడు 13వ డివిజన్ కృష్ణా కృష్ణా నగర్ లో 20 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ మరియు జె.డి నగర్ లో 5రోడ్డు లు(పేవర్ బ్లాక్స్) కోటి 22 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ అధ్యక్షలు రామాయణపు శ్రీనివాస్ తో కలిసి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడి ప్రజలు ఈ రోడ్డు కావాలని కోరారు అని, ఈ డివిజన్ లో ఓటమి చెందిన సరే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మిగిలిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి . వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుచేస్తున్నాం.గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఓడిపోయిన నియోజకవర్గలను, డివిజిన్ల ను పట్టించుకోనేవారి కాదు అని,కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏదైనా డివిజన్ లో ఓడిపోయిన సరే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. గతంలో ఈ ప్రాంత అభివృద్ధి గురుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి కాలనీ పెద్దలు, ప్రజలు ఎన్నిసార్లు తీసుకెళ్లిన సరే చేద్దాం, చూద్దాం అంటూ కాలయాపన చేసారే తప్ప పట్టించుకోలేదు అని,వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 13వ డివిజన్లలో దాదాపు కోటి రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని అన్నారు.రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఇక్కడి షో మాస్టర్,టీడీపీ నాయకులు వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు కలలు కంటున్నారని అది ఎన్నటికీ జరగదు అని అన్నారు. ఈ కార్యక్రంమలో స్టాండింగ్ కమిటీ మెంబెర్ అంబేద్కర్,రామిరెడ్డి, కార్పొరేటర్ చింతల సాంబయ్య,మాజీ కార్పొరేటర్ ఆళ్ల చెల్లారావు, 12వ డివిజన్ ఇంచార్జి మాగంటి నవీన్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఈ నెల 11న జరగబోయే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం కర్నూలు వారి, వడ్డెర సంక్షేమ సంఘం …