ఈనెల 9న జిల్లాలో 288 ప్రభుత్వ భవనాలకు సామూహిక శంకుస్థాపనలు..

-44 గ్రామసచివాలయాలు, 116 రైతుభరోసా కేంద్రాలు 128 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లకు శంకుస్థాపన..
-గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి మోడల్‌ జిల్లాగా నిలుపుదాం… జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 9వ తేదీన జిల్లాలో శంకుస్థాపన మేళాను నిర్వహించడం ద్వారా 288 ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపన చేసి నిర్థేశించిన గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు.
జిల్లాలో గ్రామ సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలు, కమ్యూనిటి శానిటరీ కాంప్లెస్‌ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు శనివారం నగరంలోని ఆయన కార్యాలయం నుండి జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 767 ప్రభుత్వ భవనాలను సెప్టెంబర్‌ 30 తేదీ లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్థేశించడం జరిగిందన్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 479 భవన నిర్మాణాలను చేపట్టగా వీటిలో 227 భవనాలు పూర్తి చేయడం జరిగిందని, మిగిలినవి వివిధ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. వివిధ కారణాల వలన ఇంకనూ 288 భవన నిర్మాణాలను ప్రారంభించవలసి ఉందన్నారు. ఈనెల 9వ తేదీన 44 గ్రామసచివాలయాలు, 116 రైతుభరోసా కేంద్రాలు, 128 వైఎస్సార్‌ కమ్యూనిటి హెల్త్‌ క్లినిక్‌లను శంకుస్థాపన చేసేందుకు, శంకుస్థాపన మేళాను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శంకుస్థాపన నిర్వహించే నాటికి గృహా నిర్మాణానికి సంబంధించిన మెటిరీయల్‌ను సిద్దంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు, మండల స్థాయిలో పంచాయతీరాజ్‌ ఎఇ, ఇవోపిఆర్‌డి, ఏఇ ఆర్‌డిడబ్ల్యుఎస్‌, యంపిడివో, తహాశీల్థార్‌, యంఏవో పర్యవేక్షణ చేస్తారన్నారు. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి జడ్పిసిఇవో, నందిగామ నియోజకవర్గానికి డిపివో, తిరువూరు నియోజకవర్గానికి ఎస్‌ఇ పంచాయతీరాజ్‌లను నియోజకర్గస్థాయిలో స్పెషల్‌ ఆఫీసర్లగా నియమించడం జరిగిందన్నారు. ఇప్పటికే భవన నిర్మాణ పనులు అప్పగించిన ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చేపట్టిన పనులు వేగవంతం చేయడం, ప్రారంభించని పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. నూతన భవనాల నిర్మాణాలకు ఏజెన్సీలను ఖరారు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణాలు చేపట్టవలసిన ప్రాంతాలకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులతో సంప్రదించడం జరిగిందని ఈ విషయమై వారికి డివో లేఖను పంపించడం జరిగిందన్నారు. ప్రజా ప్రతినిధులచే ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా ఎన్‌టిఆర్‌ జిల్లాను రాష్ట్రంలోనే మోడల్‌ జిల్లాగా పేరు తెచ్చేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *