Breaking News

రాష్ట్రం లో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, జగనన్న ప్రభుత్వం నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది.

-రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత

తాళ్ళ పూడి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, జగనన్న ప్రభుత్వం నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత అన్నారు.

మంగళవారం తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కరోనా విపత్తు వచ్చి ఆదాయ వనరులు లేకపోయినా ఋణ మాఫి, జీరో వడ్డీ పధకాలు అమలు చేసామన్నారు. గత ప్రభుత్వము చేయలేని అభివృద్ధిని జగనన్న ప్రభుత్వం చేసిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహిళ లకు రు.6.68 కోట్ల మేర సున్న వడ్డీ రాయితీ నేరుగా వారిబ్యాం కు ఖాతాకు జమ చేశామన్నా రు. అమ్మవడి, ఋణ మాఫీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి బృహత్తర పధకా లు పేద పజ లకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపా రు. పేదవాడి సొంత ఇంటి కల నేరవేర్చే దిశగా, రాష్ట్రం లో 32 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇవ్వండం జరుగుతొందన్నారు. అర్హత ఉండి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇ చ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజల కు, ప్రభుత్వానికి వారధిగా నిల వాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అందచెయ్యలని వనిత పేర్కొన్నారు. మంత్రి వర్యులు ఇంటింటికి వెళ్లి ఈ 3 సంవత్సరాలుగా ప్రభుత్వం అంద చేసిన సంక్షేమ పధకాలు వివరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. గడప గడపలో మంత్రికి మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్య వసాయ అధికారులతో వ్యవసాయంలో సూచనలు, సలహాలు ఇచ్చి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతొందన్నారు.

ఈ కార్యక్రమం లో ఎ. యం. సీ. ఛైర్మెన్, వి. గంగాధర శ్రీనివాస్, జెడ్పి వైస్ చైర్మన్ శ్రీలేఖ,తాళ్ల పూడి యం. పి. పి., జొన్నకూటి పోసిబాబు, మునిసిపల్ ఛైర్ప ర్సన్, బావన రత్న కుమారి, కరిబండి గనిరాజు, బండి పెట్టాభిరామా రావు, సర్పంచ్, నామా శ్రీనివా స్, యం. గిరిధర్, మండల తాహిసీల్దార్, శాంతి, యం. పి. డి. ఓ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం

-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్‌ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *