యోగా పట్ల గ్రామీణ ప్రజలలో ఆసక్తి కల్పించేందుకు చర్యలు…

-స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామాలలో యోగా శిక్షణ అందించేలా కృషి చేస్తా…
-యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యోగా పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసక్తి కల్పించేలా చర్యలు తీసుకుని స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామాలలో యోగా శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు.
అమరావతి యోగా మరియు యోరోబిక్స్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో పటమట హైస్కూల్‌ రోడ్డులోగల చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ముఖ్య అతిదిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మనస్సు, ప్రశాంతత, బుద్ది తేజోవంతానికి యోగా ఎంతో దొహదపడుతుందన్నారు. యోగాను అచరించడం ద్వారా శరీరక మానసిక రోగాలకు పరిష్కారం లభిసుందన్నారు. ప్రాచీన, పురాతన కాలం నుండే యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఆరోగ్యకర జీవితానికి శరీరం, మనస్సుల మధ్య సమతౌల్యానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. సహజంగా యోగా విద్యను పట్టణ ప్రాంతాల ప్రజలే అచరిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు యోగా పట్ల ఆసక్తి కల్పించి వారికి యోగా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ గ్రామంలో యోగా పట్ల ఆసక్తి కలిగిన ఒకరిద్దరిని గుర్తించి వారికి యోగాలో శిక్షణ అందించి వారి ద్వారా గ్రామ ప్రజలకు శిక్షణ అందించిన్నటైతే ఆరోగ్యవంతమైన జీవితాన్ని, మానసిక ఉల్లసాన్ని కల్పించగలుగుతామన్నారు. అతీతమైన ఆనందం, మనస్సు ప్రశాంతత, కల్మషంలేని మనస్సు కలిగి రజోగుణానికి దూరంగా ఉన్నపుడు పరిపూర్ణమైన సుఖం యోగాతోనే సాధ్యమవుతుందన్నారు. యోగా ఆసనాల ద్వారా హైపర్‌ టెన్షన్‌, థైరాయిడ్‌, మధుమేహం వంటి వ్యాధుల భారిన పడకుండా నిత్యయవ్వనవంతులుగా ఉండగలుగుతారన్నారు. యోగా సాధన దినచర్యగా మారిన నాడు ఔషదాల వినియోగం ఘననీయంగా తగ్గుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలు ఒకే రోజు యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు. క్రమం తప్పకుండా ప్రతి రోజు కనీసం 15 నిమిషాలు యోగా, 15 నిమిషాలు మెడిటేషన్‌ చేస్తానని ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.
అమరావతి యోగా మరియు యోరోబిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ప్రతీ ఏటా 2 వేల మందికి ఉచితంగా యోగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు యోగా శిక్షణ అందించడంలో జిల్లా కలెక్టర్‌ తీసుకునే చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అంతార్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక యోగా శిక్షణ తరగతులలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు, మెడల్స్‌, యోగా డ్రస్‌లను అందజేసి యోగా గురువు సత్యానారాయణను జిల్లా కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో అమరావతి యోగా మరియు యోరోబిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సిహెచ్‌ అరుణ కుమార్‌, కార్యదర్శి యండి ఇక్బాల్‌, కోశాధికారి పివి రమణ, ఉపాధ్యక్షులు టి హరికృష్ణ, యోగా కోచ్‌ ఏ సత్యానారాయణ, అసోసియేషన్‌ సభ్యులు ఏ.యల్లారావు, జి. లావణ్య కుమార్‌, యండి షిరాజ్‌, ప్రశాంత్‌కుమార్‌, విశ్వనాథ్‌, కె రెడ్డెమ్మ, గాంధీబాబు, శ్రీనివాస్‌, ఎన్‌టిఆర్‌ జిల్లా యోగా అసోసియేషన్‌ సెక్రటరి మురళి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *