విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల హక్కులు చట్టాలపై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించి లైగింక వేధింపుల నివారణ బాలల సంరక్షణలో ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సారధ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వి.సుజాతలు అన్నారు.
అమరావతి హైకోర్టు భవనంలో మంగళవారం జువెనైల్ జస్టిస్ హైకోర్టు కమిటీ సమావేశంలో పిల్లలపై లైగింక వేధింపుల నిరోధించేందుకు ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ రూపొందించిన బాల్యం – అమూల్యం, ‘‘అరవండి- పరగెత్తండి -చెప్పండి’’, తెలుగు పోస్టర్లను, ‘‘షవుట్- రన్- టెల్’’ ఇంగ్లీష్ లో రూపొందించిన పోస్టర్లను ‘‘గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్’’ల మధ్య వ్యత్యాసంపై 8 నిమిషాల నిడివి తో రూపొందించిన వీడియోను న్యాయమూర్తులు అవిష్కరించారు.
నిస్సహాయ స్థితిలో ఉన్న బాలలు చైల్డ్ లైన్ నెంబర్ 1098, పోలీస్ 100, మహిళాహెల్ప్‌లైన్ 181 ఎస్‌వోఎస్‌కి కాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని, అసౌకర్యంగా ఉన్న పిల్లలు దగ్గర బందువులు, పెద్దల సహాయం కొరకు ‘‘అరవండి- పరుగెత్తండి- చెప్పండి, పోస్టర్లను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలల తరగతి గదులలో స్కూల్, కళాశాలల బస్సులలో, విభిన్నప్రతిభావంతులకు ఆశ్రయం ఇస్తున్న వసతి గృహాలు, విద్యార్థులు, ఉద్యోగల వసతి గృహాలలోను స్పెషల్ చిల్డ్రన్ హోమ్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయలు, ఎగ్జిబిషన్, బస్టాండ్, రైల్యేస్టేషన్‌లు షాపింగ్ మాల్స్‌లలో శాశ్వతంగా ఉండేలా పోస్టర్లను ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్, రైల్యేస్టేషన్‌లు, షాపింగ్ మాల్స్‌లలో ఏర్పాటు చేసిన టివీల ద్వారా ‘‘గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్’’ల మధ్య వ్యత్యాసంపై 8 నిమిషాల నిడివి తో రూపొందించిన వీడియోల ప్రదర్శన తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఇబ్రహీంపట్నంలో అన్నమ్మ దివ్యాంగుల వీధిబాలల పునరావాస కేంద్రంలో ఇటీవల జరిగిన లైగింక వేధింపుల పై జువెనైల్ జస్టిస్ హై కోర్టు కమిటీ సమీక్షించి భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్వచ్చంద సంస్థలు నిర్వహించే పునరావాస కేంద్రాలు, హాస్టల్స్‌లలో పటిష్ట నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలలపై లైగింక వేదింపుల నివారణ, బాలల సంరక్షణ కొరకు ఎన్‌టిఆర్ జిల్లా యంత్రాంగం రూపొందించిన అవగాహన పోస్టర్లలు, వీడియోలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో చేపట్టేలా చర్యలు తీసుకోవడంపై జువెనైల్ జస్టిస్ హైకోర్టు కమిటీ ఆసక్తి వ్యక్తం చేసింది.
కమిటీ సమావేశంలో ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు, విజయవాడ నగరపోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐసిడిఎస్ ఏడి శ్రీలక్ష్మి, పిడి జి. ఉమాదేవి, జిల్లా ప్రొబేషన్ అధికారి భాస్కర్‌రావు, వికాలాంగుల సంక్షేమ శాఖ ఏడి రామ్‌కుమార్, ఫోరంఫర్ చైల్డ్‌లైన్ కో`ఆర్డినేటర్ అరవ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …