అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 09.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 11 గంటలకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చేరుకుంటారు. 11.15 – 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Tags amaravathi
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …