Breaking News

శ్రీ ప్రత్యూష ఫెర్టిలిటీ మెటర్నటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లంపల్లి, మేయర్, మల్లాది, దేవినేని…


-నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం డా. ప్రత్యూష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సూర్యాపేటలోని దాసరివారివీధిలో శ్రీ ప్రత్యూష ఫెర్టిలిటీ, మెటర్నటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు వైసిపి నాయకులు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యుత్తమమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా గా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం ఆనందించదగ్గ విషయం అన్నారు. లాభాపేక్ష కు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ సేవా భావంతో ఆసుపత్రిని నడపాలని ఆస్పత్రి నిర్వాహకులకు సూచించారు. డా. ప్రత్యూష మాట్లాడుతూ నాణ్యమైన ప్రసూతి సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రసూతి వైద్యం కోసం కావలసిన అన్ని ఏర్పాట్లు ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాభాపేక్ష కంటే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తాము ఈ ఆసుపత్రిని ప్రారంభించామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *