విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ విద్యా సంవత్సరం 15,474 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పథకం వర్తించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికీ నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలనే ఉత్సాహం తల్లిదండ్రుల్లో ఉండేది కాదని.. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో పెనుమార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అయితేనే తమ పిల్లలను చదివిస్తామనే విధంగా చిన్నారుల తల్లిదండ్రులలో మార్పు వచ్చిందన్నారు. గత తెలుగుదేశం హయాంలో విద్యా సంవత్సరం సగం పూర్తయినా కూడా పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందేవి కాదని మల్లాది విష్ణు అన్నారు. కానీ నేడు తొలి రోజే అందిస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యా వ్యవస్థపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ.. దేశంలో మరే ప్రభుత్వం సారించలేదని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …