Breaking News

నేడే మార్కెట్లోకి యుపియల్ వారి విశిష్ట సస్యరక్షణ ఉత్పాదన “కెవుక” విడుదల


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ బహుళజాతి సంస్థ యుపియల్ లిమిటెడ్ వారు గన్నవరం, ఎబి కన్వెన్షన్ సెంటర్ హాలునందు నూతన క్రిమిసంహార విశిష్ట సస్యరక్షణ ఉత్పాదన కెవుక పురుగులమందును మార్కెట్లోనికి విడుదల చేశారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా మార్కెటింగ్ హెడ్ ఇండియా సవీష్ కుమార్, సేల్స్ హెడ్ సౌత్ ఇండియా ప్రతాప్ రన్ ఖాంబ్, క్రాప్ మేనేజర్ రైస్ పోర్ట్ పోలియో బ్రహ్మానంద రెడ్డి మరియు లోకల్ జోనల్ సేల్స్ మేనేజర్ చాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మార్కెటింగ్ హెడ్ ఇండియా సవీష్ కుమార్ మాట్లాడుతూ మీ అందరి ఆదరాభిమానాలతో యుపియల్ వ్యాపారం ఎంతో అభివృద్ధి గడించిందని తెలుపుటకు మేము ఎంతగానో గర్విస్తున్నాము. ఈ మహోత్తర విజయానికి తోడ్పాటునిచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ 1969వ సం||లో స్థాపించబడిన యుపియల్ సంస్థ రీసెర్చ్ & డెవలప్మెంట్ సాధించిన కృషి ఫలితంగా 388 కు పైగా విదేశీ రిజిస్ట్రేషన్ కలిగి 2021-22 సం||రానికి 20వేల కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యంతో ముందుకు సాగుతున్న అగ్రగామి సంస్థ యు.పి.యల్ అని తెలిపారు.

సేల్స్ హెడ్ సౌత్ ఇండియా ప్రతాప్ రన్ంబ్ మాట్లాడుతూ యుపియల్ కంపెనీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు సాధించిన నాణ్యమైన సస్యరక్షణ ఉత్పాదనలు అందజేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, ఇంధన వినియోగంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధిస్తున్న సంస్థ యుపియల్ ప్రపంచ వ్యాప్తంగా ఆహార పరిరక్షణకు కావలసిన సస్యరక్షణ మందులను టెక్నికల్ గ్రేడ్లతో సహా తయారుచేసి రైతుల అవసరాలకు తగిన విధంగా ఫార్ములేషన్లను అందజేసి ప్రముఖ బ్రాండ్ రైతుల ఆదరాభిమానాన్ని పొందిన సంస్థ యుపియల్ అని తెలియచేశారు.

క్రాప్ మేనేజర్ రైస్ పోర్ట్ పోలియో బ్రహ్మానంద రెడ్డి ఈ రోజు మార్కెట్లో విడుదల చేసిన ఉత్పాదన గురించి వివరిస్తూ ఈ రోజు భారతదేశంలో ఫ్లూపైరిమిన్ అనే క్రియాశీల పదార్థం (పేటెంట్ పొందింది) కలిగిన కెవుక. ఇది అత్యంత హానికరమైన వరి పంటను ఆశించే కీటకాలను సమర్ధవంతంగా నియంత్రించడానికి ఉపయోగపడుతుందన్నారు. కెవుక పరిచయంతో రైతులు తమ వరి పంట యొక్క అత్యంత క్లిష్టమైన ఎదుగుదల దశలలో హామీతో కూడిన రక్షణను అనుభవించవచ్చన్నారు.

లోకల్ జోనల్ సేల్స్ మేనేజర్ చాట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ యు.పి.యల్  ఓపెన్  ఏ జి విజన్ కి అనుగుణంగా జపనీస్ కంపెనీ అయిన పేటియం  సహకారంతో పైరిమిన్ అనేది వరి పండించే రైతుల కీటకాల నియంత్రణలో ముందుకు దూసుకుపోతుందని వాగ్దానం చేశారు. వరి పంటలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు, రెండవ అతిపెద్ద రైతులు ఉత్పత్తిదారు గల దేశం అని తెలియజేశారు.

వాటి వినియోగంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు పాటించవలసిన నియమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, కంపెనీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *