-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తిభావం కరుణ విశ్వాసం ఐక్యత త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు భక్తితో జరుపుకుని అల్లా ఆశీస్సులతో సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు బక్రీద్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. దైవప్రసన్నతకోసం మహ్మద్ ప్రవక్త ఇబ్రహీం చేసిన మహా త్యాగాన్ని సర్మించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారన్నారు. అల్లా ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి పదంలో మందుండేలా ముస్లిం సోదర సోదరీమణులు ప్రార్థన చేయాలని కలెక్టర్ డిల్లీరావు ఆకాంక్షించారు.