-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అగ్రికల్చర్ ఫార్మా, ఆటోమొబైల్ టెక్స్‌టైల్ రంగాలలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సభ్యులతో బుధవారం కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎన్‌టిఆర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికే అగ్రి ఫార్మా అటోమొబైల్ టెక్స్‌టైల్ తదితర రంగాలలో పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తులను తయారు చేస్తున్నారన్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహ పరిశ్రమలను స్థాపించే వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగల్ డెస్క్ విధానం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 37 మంది ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ధరఖాస్తులు చేసుకోగా 12 ధరఖాస్తులకు అమోదం తెలియజేయడం జరిగిందని మిగిలిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక వేత్తలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేలా ప్రోత్సహించుకునేందుకు బ్యాంకుల నుంచి బుణాలు ఓషన్‌ఫైయిట్ కంటైనర్ సౌకర్యం పొందడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న బడుగు వికాసం ద్వారా సూక్ష్మ చిన్న మధ్య తరహ పరిశ్రమలకు ఇన్సెన్‌టివ్ సబ్సిడీ, పావలా వడ్డీ, విద్యుత్ రాయితీ, స్టాంపు రాయితీలుగా ఈ ఏడాది సుమారు 5.40 కోట్ల రూపాయలను మంజూరుకు కమిటీ అమోదం తెలిపిందన్నారు. 48 మంది ట్రాక్టర్ ట్రైలర్ల లబ్దిదారులకు ప్రోత్సహక నగదును అందిస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమల భద్రతా సమావేశాలను ప్రతి నెల నిర్వహించి పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కమిటీ సభ్యులకు సూచించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో ఏపిఐఐసి జోనల్ మేనేజర్ వి. శ్రీనివాసరావు, డిప్యూటి ఛీప్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె. శ్రీనివాస్, టెక్స్‌ఫోసిల్ ప్రతినిధి ఎస్. రాజేష్, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, ఎంపెడ అసిస్టెంట్ డైరెక్టర్ రఘనాద్‌రాజు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి. శ్రీనివాస్‌రావు , ఏపిఎస్‌్‌ఎఫ్‌సి జియం సి వెంకయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.