Breaking News

అధికారులు సమన్వయంతో అదనపు తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయండి…

-కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాశాఖ పంచాయతీరాజ్‌ మండల అభివృద్ధి అధికారులు సమన్వయంతో మనబడి నాడు`నేడు పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. జిల్లాలో నాడు నేడు పథకం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాల ప్రగతిపై బుధవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 465 పాఠశాలలో 898 అదనపు గదులను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. విద్యాశాఖ అధికారులు స్థానిక మండల అభివృద్ధి అధికారులు పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ అధికారుల సమన్వయంతో పనులు వేగవంతం చేసి నిర్థేశించిన గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. తరగతి గదుల నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, కంకర వంటి సరఫరా చేయడం జరుగుతుందని ఈ విషయంలో సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ తెలిపారు. అసిస్టెంట్‌ ఇంజనీర్లు సమర్థవంతంగా పనిచేయాలని చేపట్టిన పనులపై యంఇవోలకు పూర్తి అవగాహన వుండాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పర్యవేక్షణలో అదనపు గదుల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ప్రతి వారం మండల స్థాయిలో సమావేశం నిర్వహించి పనుల ప్రగతిపై సమీక్షించి నివేధికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. వీడియోకాన్పరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌కుమార్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, డిఇవో సివి రేణుక, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *