విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించటం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. దేశ తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఆమె ఎన్నిక కావడం శుభపరిణామం అన్నారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారన్నారు. ఒడిశాలో మారుమూల ప్రాంతంలో జన్మించి కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, మంత్రిగా, గవర్నర్ గా పని చేసి, నేడు అత్యున్నత స్థానానికి చేరుకున్నారని గవర్నర్ అన్నారు. అత్యధిక శాతం ఓట్లతో విజయ కేతనం ఎగరవేసిన ద్రోపతి ముర్ము ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనుండటం అభినందనీయమన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …