జిల్లాలో ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగిరేలా చర్యలు…

-మన ఇంటి పండుగ భావనతో హర్‌ఘర్‌ తిరంగా నిర్వహిస్తాం…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రతీ ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురవేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహణ పై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్‌ భార్గవ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగిందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్స్‌ ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు సినిమా థిóయేటర్లలో లఘు చిత్రాలు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రప్రభుత్వం నుండి జాతీయ పతాకాలు సరఫరా చేయడం జరుగుతుందని వాటిని వెంటనే జిల్లాలకు పంపిణీ చేస్తామన్నారు. జాతీయ పతాకాలు ఎగురవేసేందుకు అవసరమైన కర్రలు అటవీ శాఖ అధికారులు సమకూరుస్తారని తెలిపారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని రజిత్‌ భార్గవ జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
ఎన్‌టిఆర్‌ జిల్లా నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13,14,15 తేదీలలో నిర్వహించే హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించి ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని వివిధ శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో వైభవంగా నిర్వహించేందుకు రూపకల్పన చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజలలో దేశభక్తి జాతీయ భావాన్ని పెంపొందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే విధంగా కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నామన్నారు. విద్యార్థిని విద్యార్థులు, యువతి యువకులు, క్రీడా కారులతో ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ పతాక విశిష్టత దేశభక్తి తదితర అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలపైనా అధికారులు సిబ్బంది నివాసాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆగస్టు 2వ తేదిన జాతీయ జెండా రూపకర్త పింగళివెంకయ్య జన్మదినాన్ని పురష్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసిన జాతీయ జెండాలను ప్రతి ఇంటికి పంపిణీ చేసి పతాకాలను ఎగురవేయడం ద్వారా జిల్లాకు పండుగ వాతావరణం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవకు వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌కుమార్‌, డిపివో చంద్రశేఖర్‌, జిల్లా టూరిజం ఆఫీసర్‌ ఓ. హేమచంద్ర ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *