మేమే మీకు అమ్మనాన్నలై అండగా ఉంటాం…

-ఆకాశమే హద్దుగా చదువుకోండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిదండ్రులు లేరని బాధపడవద్దు మేమే మీకు అమ్మనాన్నలం అందరూ మీకు అండగా ఉంటాం. మీరు ఉన్నత చదువులు చదువుకుని మంచి పౌరులుగా స్థిరపడాలని అంటూ ఆనాధపిల్లలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆక్కున చెర్చుకున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయి అనాధులై అమ్మమ్మ పంచన చేరి దుర్భర జీవితం గడుపుతున్న కట్టా లావణ్య కట్టా భవాని, కట్టా రాధలను గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని ఛాంబర్‌కు పిలుపించుకుని పిల్లలతో ముచ్చటించారు. పిల్లలనుండి వివరాలను సేకరించి ధైర్యాన్ని నింపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విజయనగరం జిల్లా కు చెందిన కట్టా యాకోబు లక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు జన్మించారని తెలిపారు. గత 20 సంవత్సరాల క్రితం లక్ష్మి తల్లి పీతల పార్వతి నగరానికి వలస వచ్చి కూలీపనులు చేసేదన్నారు. అనంతరం లక్ష్మి యాకోబులు కూడా నగరానికి వలస వచ్చి చిత్తు కాగితాలు ఏరుకుని జీవించేవారన్నారు. కొంత కాలం క్రితం ఎయిడ్స్‌ వ్యాధితో యాకోబు, ఆనారోగ్యంతో లక్ష్మి మరణించడంతో ఆనాధలై పిల్లలను అమ్మమ్మ పార్వతి పోషిస్తుందన్నారు. ఆమె కూడా వృద్దురాలు కావడంతో పనులు చేయలేని పరిస్థితులలో పిల్లలను బ్రతికించుకోవడం కష్టతరమయిందన్నారు. ఈ విషయం తన దృష్టికి రావడం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా ఈ విషయంపై ఆనాధలైన పిల్లలకు సహయం అందించాలని తెలపండంతో అప్పటి సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి పిల్లలకు సహాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించానన్నారు. సబ్‌ కలెక్టర్‌, స్త్రీ శిశు సంక్షేమం, రెవెన్యూ, పౌర సరఫరాలశాఖ అధికారులు, చైల్డ్‌ లైన్‌ సిబ్బందితో ఎప్పటికప్పడు పిల్లలను కలిసి వారికి కావాల్సిన సహాయ చర్యలను తీసుకున్నారన్నారు. పిల్లలను గన్నవరం సమీపంలోని తులిఫ్‌ గార్డెన్‌ చార్టిబుల్‌ ట్రస్ట్‌ నందు చేర్పించి ఆశ్రయం కల్పించామన్నారు. అమ్మమ్మ పార్వతికి రేషన్‌ కార్డు, ఇంటి స్థలం మంజూరు చేశామని పిల్లలకు ఆధార్‌ కార్డులను అందజేయడం జరిగిందన్నారు. గన్నవరంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో కట్టా లావణ్యను 8వ తరగతిలోను, మల్లికార్జున ఇంగ్లీష్‌ మీడియంలో కట్టా రాధ ఒకటవ తరగతి, కట్టా భవానిని యుకెజిలో చెర్పించి విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకున్నామన్నారు. చిన్నారులకు ఎన్‌టిఆర్‌ జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారాలను అందించి ఉన్నత చదువులను అభ్యసించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు వారి జీతం నుండి ఒక్కోక్కరూ నెలకు 250 రూపాయలు చిన్నారుల ఖాతాలలో జమ చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఆనాధలైన పిల్లలకు దుర్భర జీవితం నుండి విముక్తి కల్పించి బంగారు భవిషత్‌కు బాటలు చూపిన సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, డిఎస్‌వో కోమలిపద్మ, నార్త్‌ తహాశీల్థార్‌ దుర్గప్రసాద్‌, సిడబ్ల్యూసి కమిటీ చైర్‌పర్సన్‌ సువార్త, చైల్‌లైన్‌ జిల్లా కో`ఆర్డినేటర్‌ ఆరవ రమేష్‌, నవజీవన్‌బాలభవన్‌ తులిఫ్‌గార్డెన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *