-7 గ్రామాలలో 13 నోటిఫికేషన్ పూర్తి….
-సిసిఎల్ ఏ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం పనులు జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నాయని ఇప్పటికే భూ సర్వే పూర్తి చేయడంలో భాగంగా జిల్లాలో 7 గ్రామాలలో 13 నోటిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, కార్యదర్శి బాబు ఏ, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమీషనర్ సిద్ధార్థ జైన్‌లు ప్రధాన కార్యాలయం నుండి గురువారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో ఎన్‌టిఆర్ జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, సిసిఎల్‌కు జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిని వివరించారు. జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం పనులలో భాగంగా భూ సర్వేలో చివరిదైన 13వ నోటిఫికేషన్ 7 గ్రామాలలో పూర్తి చేయడం జరిగిందన్నారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట, కంచికచర్ల మండలం పరిటాల, గంపలగూడెం మండలం రాజవరం, చెన్నవరం, ఎ కొండూరు మండలంలోని వామకుంట్ల, మారేపల్లి, విస్సన్నపేట మండలం చంద్రుపట్ల గ్రామాలలో పూర్తి అయిందన్నారు. 16 గ్రామాలలో ఓఆర్‌ఐ లు వచ్చాయన్నారు. దానిలో 7 పూర్తి చేశామన్నారు. మిగిలినవి 8 ఉన్నాయన్నారు. అందులో 5 గ్రౌండ్ వ్యాలిడేషన్ 3 గ్రౌండ్ ట్రూతింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. జగ్గయ్యపేటలో 6 గ్రామలు, వాత్సయిలో 3 గ్రామాలు డ్రోన్ ప్లె˜ౖ పూర్తి అయిందన్నారు. గంపలగూడెం మండలం కనుమూరు ఎల్‌పియం జరుగుతుందన్నారు. గంపలగుడెం, హనుమంతుల లంక, తిరువూరు మండలం ఆంజనేయపురం, వత్సవాయి మండలం చిట్యాల, తిరువూరు మండలం ముస్తిగుంట్ల గ్రామాలలో గౌండ్ వాలిడేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. 26 గ్రామలలో డ్రోన్ ప్లె˜ౖ ప్రక్రియ పూర్తి అయిందని కలెక్టర్ సిసిఎల్‌కు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ కుమారి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికాడ్స్ ఆఫీసర్ కె. సూర్యరావు, ఆర్‌జెడి కెజియ కుమారి, ఉన్నారు.