రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరియు గోదావరి వరదలకు ముంపుకు గురి అయిన హుకుంపేట, సావిత్రి నగర్ పరిసర ప్రాంతాలను రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ మరియు రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ సందర్శించారు. ముంపుకు గురి అయిన ప్రాంతాలలోని నివాసాల వద్దకు వెళ్లి నివాసితులు తో స్వయంగా మాట్లాడి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను విని సంబంధిత అధికారులను తీసుకుని నిలువ వున్న నీటిని యుద్ద ప్రాతిపదిక మీద మళ్ళించే ఏర్పాటు చేయాలని సూచించారు. తక్షణమే అధికారులు మోటార్లను ఏర్పాటు చేసి నీళ్లను మళ్ళించడం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఎంపీ భరత్ పర్యవేక్షిస్తూ వున్నారు. నివాసం వుంటున్న ప్రజలు, పిల్లలు స్కూల్ కు వెళ్ళే విధముగా వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు అలాగే రోజు వారి కూలి పనులకు వెళ్ళే కార్మికులకు, ఆసుపత్రి కు వెళ్ళే వారికి కూడా వాహన సౌకర్యం ఏర్పాటు చెయ్యడం జరిగింది అని ఎంపీ భరత్ తెలిపారు. రాబోయే ఒకటి లేదా రెండు రోజులలో ఈ ప్రాంతం సాధారణ పరిస్థితి కు వస్తుంది అని ఎంపీ భరత్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర, బొప్పన సుబ్బారావు, పసలపూడి శ్రీనివాస్, సూపర్ స్సిక్స్టీ టీమ్ పీత రామక్రిష్ణ, హితకారిణి ట్రస్ట్ డైరెక్టర్ ఉల్లూరి రాజు, పెనుమాక సునీల్, బిల్డర్ చిన్న, గేడి అన్నపూర్ణ రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మండల పరిషత్ అధికారిణి రత్నకుమారి, పంచాయతీ కార్యదర్శి వెంకటరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
