విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ విజయలక్ష్మి సుంకర విజయవాడ రైలే స్టేషన్‌ను ఇన్స్పెక్షన్లో భాగంగా విజయవాడ రైల్వే జంక్షన్ నందు జరుగుచున్న అభివృద్ధి పనులను వర్యవేక్షించి, రైల్వే అధికారులను విచారణ చేయడం జరిగింది. ప్రయాణీకులతో నేరుగా మాట్లాడి, ప్రయాణీకుల కలిగే సమస్యల గురించి అడిగి తెలుసుకొన్నారు. (1) కోవిడ్-19కు రాకమునుపు కొనసాగిన అన్ని పాసింజర్ రైలు సర్వీసులను పునఃప్రారంభించే విధముగా చర్యలు చేపట్టుట, (2) మధ్య తరగతి మరియు సాధారణ తరగతి ప్రయాణీకులకు వేచియుండుటకు, వారి సరియైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించుట. (3) రైలు నెం.57223 గూడూరు-విజయవాడల మధ్య ఫాస్టు పాసింజర్ నకు రైతులు మరియు సామాన్య ప్రయాణీకులు మరింత అందుబాటులో ఉండేవిధముగా మరిన్ని స్టాప్‌లు పెంచుటకు రూట్-సర్వే కొరకు ప్రతిపాదించడం. సదరు సమస్యలను ఉన్నత అధికారులు జోనల్ రైల్వే మేనేజర్ వారితో చర్చించి, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు తగు చర్యలు ఈ వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలలోనే కేంద్రమంత్రులు దృష్టికి తీసుకువెళ్ళి, సదరు సమస్యల పరిష్కారం సత్వరమే చేపడతామని తెలియజేశారు.
Prajavartha Online Telugu News