Breaking News

రెవెన్యూ సభార్డినేట్స్ సర్వే శిక్షణ తుది పరీక్ష ప్రశాంతం..

-629 అభ్యర్థులకు గాను 536 మంది హాజరు..
-శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు ఆరు జిల్లాల మల్టీ జోన్ లో బాగంగా నగరంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు.
-జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెవిన్యూ ఉద్యోగులకు 42రోజుల సర్వే శిక్షణ పూర్తయిన తర్వాత నిర్వహించే తుది పరీక్షను నగరంలోని మాంటిస్సోరి కళాశాలలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కమిషనర్ సర్వే సెటిల్మెంట్స్ ఆదేశాల ప్రకారం శ్రీకాకుళం నుండి కృష్ణాజిల్లా వరకు ఆరు జిల్లాల మల్టీ జోన్ వన్ లో భాగంగా నగరంలోని మాంటెస్సోరి కళాశాలలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 629మంది అభ్యర్థులకు గాను 536మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆమె అన్నారు. డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస రావు కోఆర్డినేటర్ గా, సహాయ సంచాలకులు జిల్లా సర్వే శాఖ ఏ సూర్యారావు, ఏపీ ట్రైనింగ్ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ విల్సన్ కుమార్ లు పర్యవేక్షకులుగా నిర్వహించారని జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలని, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *