ఫారిన్ లాంగ్వేజ్ లు నేర్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు… : హర్ష్ సదావర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త విద్యా విధానం మరియు విద్యాపరమైన నైపుణ్యం వ్యవస్థను ప్రోత్సహించడంలో “సిటి యూనివర్శిటీ” ప్రధాన పాత్ర పోషిస్తుందని… మా ప్రధాన లక్ష్యం కూడా అదేనని “సిటి యూనివర్శిటీ”  వైస్ ఛాన్సలర్ డాక్టర్ హర్ష్ సదావర్తి అన్నారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో డాక్టర్ హర్ష్ సదావర్తి మాట్లాడుతూ అత్యాధునికమైన ప్రయోగశాలలు ఉన్నత స్థాయి కమ్యూనికేషన్ నైపుణ్యాలు విదేశాలలో ఫారిన్ యూనివర్సిటీ తో టైఅప్‌లు  ఎమ్మెస్ చేయడానికి శిక్షణ ఇవ్వటం  ఫారెన్ లాంగ్వేజ్  లు నేర్పించడం సిటీ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థలు యొక్క ప్రధాన కర్తవ్యం అని అన్నారు. సిటి యూనివర్శిటీ, శంకర ఐ హాస్పిటల్స్‌తో కలిసి పనిచేసిందన్నారు. సినీ నటుడు సోనూసూద్ యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే కాకుండా స్కాలర్‌షిప్ సహకారం అందిస్తున్నారన్నారు. మెరిట్ స్కాలర్‌షిప్‌లు 100% ప్లేస్‌మెంట్, శిక్షణ మరియు ఇంటర్న్‌షిప్‌లు, డిగ్రీ విద్య తో  సివిల్ కోచింగ్ అత్యాధునికమైన వసతి  మరియు ఇంటి తరహా ఆంధ్ర భోజనం సౌకర్యం ఉందని అన్నారు. దక్షిణాది విద్యార్థుల సౌకర్యార్థం విజయవాడలో ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభించబడిందదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్స్లర్ డాక్టర్  మన్బీర్  సింగ్, వైస్ ఛాన్స్లర్  డాక్టర్ హర్ష్ సదావర్తి, ప్రిన్సిపల్ ఆదిత్య గోయల్, ఆంధ్ర తెలంగాణ అడ్మిషన్ ఆఫీసర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *