విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్జీలు పునరావృతం కాకుండా ప్రాధమిక స్థాయిలోనే నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్జీదారులు, సంబంధిత అధికారులతో స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్) ఆర్జీల సమస్యల ను గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పరిష్కరించారు. స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధించిన ఆర్జీదారులు, అధికారులతో కలెక్టర్ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి శనివారం గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని పునరావృతమవుతున్న (రీఒపెన్) స్పందన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్జీదారులు సంతృప్తి చేందేలా నాణ్యతతో కూడిన పరిష్కారమార్గం చూపేవిధంగా ఆర్జీదారులు, సంబంధిత అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ విధానాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమస్య పరిష్కారం అయినప్పటికి సంతృప్తి చెందక మరల స్పందనలో ఆర్జీదారుడు తిరిగి ఆర్జీని సమర్పిస్తున్నారన్నారు. ఇటువంటి ఆర్జీలను గుర్తించి ఆర్జీదారుడు సంతృప్తి చెందలేకపోతున్నాడనే విషయంపై ఆర్జీదారుడు సంబంధిత అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి కారణాలపై కూలంకుషంగా చర్చిస్తున్నామన్నారు. సమస్య పరిష్కారంలో అధికారుల లోపముంటే వాటిని సరిదిద్ది ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ విధానం వల్ల స్పందనలోని ప్రతీ సమస్యకు స్పష్టమైన పరిష్కారం ఇవ్వాలనదే తమ లక్ష్యమన్నారు. ఆర్జీలను మరింత నిశతంగా పరిశీలించి వారి పరిధిలోనే సమస్యలను నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని ఆర్జీదారునికి చూపించగలుగుతారన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్) ఐదు ఆర్జీలకు సంబంధించి ఆర్జీదారులు సంబంధిత అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్జీలకు పరిష్కారం చూపారు. విజయవాడ రూరల్ పినైనవరంకు చెందిన ప్రసన్న కుమార్, కంచికచర్లకు చెందిన బి వెంకటేశ్వరరావు, గంపలగూడెం మడంలం వినగడపకు చెందిన వి.శీరిషపద్మా, వీరులపాడు మండలం పెద్దపూరంకు చెందిన జె. రత్నాకర్‌లు రెవెన్యూ పరమైన, జగ్గయ్యపేట మండలం రంగాస్వామిబజార్‌కు చెందిన యు. రవికుమార్ విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించి రీఒపెన్ ఆర్జీలను పరిష్కరించిన్నట్లు కలెక్టర్ డిల్లీరావు అన్నారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, ఆర్జీదారులు ,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …