-డిఆర్‌వో కె. మోహన్‌కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 31వ తేదీ ఆదివారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించనున్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్`4) పరీక్షలకు పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లతో సిద్దంగా ఉంచాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
ఈనెల 31వ తేదీ ఆదివారం నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షల నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై శనివారం డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షలకు 18,195 మంది అభ్యర్థులు హాజరకానున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు కేటాయించిన 41 కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ద్దంగా ఉంచాలన్నారు. పరీక్షలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతాయని అభ్యర్థులు గంట ముందుగా అనగా ఉదయం 10:00 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకుని వారికి కేటాయించిన హాల్‌టిక్కెట్ నంబర్లల ఆధారంగా గదులను పరిశీలించుకోవాలన్నారు. అభ్యర్థులు ఉదయం 10:45 నిమిషాల తరువాత పరీక్ష కేంద్రాలకు అనుమతి ఉండదని డిఆర్‌వో అన్నారు. పరీక్షల అనంతరం ప్రశ్నాపత్రాల బుక్‌లెట్, ఓయంఆర్ ఆన్సర్ షీట్ కార్బన్ జిరాక్స్ కాపీలను అభ్యర్థులు తమతో తీసుకువెళ్ళవచ్చునన్నారు. పరీక్ష కేంద్రాలలో సంబంధిత కళాశాలలు, పాఠశాలల యాజమన్యాలు, నిర్వహకులు, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసిన, అవకతవకలకు పాల్పడిన సంబంధిత కేంద్రాలపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఆర్‌వో అన్నారు. అభ్యర్థులు తమతో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటర్ కార్డు వంటి ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. అధికారులు సమన్వయంతో ఏపిపిఎస్‌సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షలను విజయవంతం చేయాలని డిఆర్‌వో కె. మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గమనిక:
సెంటర్ కోడ్ నెంబర్ 6066 కేంద్రంలో పరీక్షలు రాసే అభ్యర్థులకు హాల్‌టికెట్ల నందు శ్రీ విజ్ఞాయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌కు బదులుగా విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌గాను డోర్ నెంబర్ 23-24-28ఏ నియర్ నౌలార్‌కు బదులుగా నియర్ నాడార్ గాను సరిచూసుకోవాలని, సెంటర్ కోడ్ నెంబర్ 6075 కేంద్రంలో పరీక్షలు రాసే అభ్యర్థులకు హాల్ టికెట్ల నందు జూడి కి బదులుగా జూపూడి ఇబ్రహీంపట్నంగా సరిచూసుకోవాలని డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ తెలిపారు.
Prajavartha Online Telugu News