-పరీక్షలకు 5875 మంది అభ్యర్థులు హాజరు…
-డిఆర్వో బి. సుబ్బారావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షలకు 5875 మంది అభ్యర్థులు హాజరయ్యారని డిఆర్వో బి. సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రేడ్-4) పరీక్షలకు 33 కేంద్రాలలో 9440 మంది అభ్యర్థులకు హాజరు కావలసి ఉండగా 5875 మంది అభ్యర్థులు హజరయ్యారని, 3566 మంది పరీక్షలకు హాజరు కాలేదని తెలిపారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల శాతం 61 శాతంగా ఉందని డిఆర్వో ఆ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహానకు కేటాయించిన 33 కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లుతో విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన ఆదివారం ప్రకటనలో తెలిపారు.