Breaking News

సోమవారం స్పందన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్ట్ 1వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి IAS ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి కమిషనర్  నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యల పై కమిషనర్ కి అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *