విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు మా మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ నిర్మలా శిశు భవన్ వద్ద స్థానిక కార్పొరేటర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఆధ్వర్యంలో దాదాపు 22లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెట్లు మార్గం మరియు ఫ్లేవర్స్ బ్లాక్స్ వర్క్స్ నిర్మాణాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అందరి సహకారంతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి లో అగ్రగామిగా నిలపడనికి కృషి చేస్తున్నామని అన్నారు.గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ లో వైస్సార్సీపీ కార్పొరేటర్ గెలిచిన సరే వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కారణంగా చిన్నచూపు చూసి అసలు అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్ల లో ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడంతో పాటు చెప్పిన గడువు కంటే ముందుగానే రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజానీకం మా మీద పెట్టుకొన్న నమ్మకం నిలబెట్టుకొన్నామని సంతోషం వ్యక్తం చేశారు. నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల మధ్యకు వెళుతుంటే ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు అని,ప్రజల సంతృప్తి కి అదే నిదర్శనం అన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ కొన్ని రోడ్లు ఆవశ్యకత గురుంచి కమిషనర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఆయన వాటికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, డివిజన్ ప్రజల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,మాజీ కార్పొరేటర్ పళ్లెం రవి,గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విజయలక్ష్మి మరియు స్థానిక డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …