విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఘనంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య 146 వ జయంతిని పురష్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో పశ్చిమ నియోజకవర్గo మిల్క్ ప్రాజెక్ట్ వద్దన గల పింగళి వెంకయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించి అయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కృష్ణ జిల్లా వాసులైన పింగళి వెంకయ్య కాంగ్రెస్ మహాసభలో మువ్వన్నెల పతాకాన్ని రూపొందించి మహాత్ముడి సమక్షంలో ఆమోదం పొందిన త్రివర్ణ పతాకమే నేటికి కోట్లాది భారతీయుల హృదయాలలో దేశ భక్తిని ప్రతిబింబిస్తూదని అన్నారు. తదుపరి విద్యార్ధులతో కలసి కేకు కట్ చేసినారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘన విజయం చేయాలని ఆకాంక్షిస్తూ అధికారులు మరియు సచివాలయ సిబ్బందితో కలసి అవగాహన ర్యాలి నిర్వహించారు. కార్యక్రమములో జోనల్ కమిషనర్ సుధాకర్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, అసిస్టెంట్ కమిషనర్ డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పింగళి వెంకయ్య వేడుకలు
నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, ఆదేశాలకు అనుగుణంగా ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో నగరపాలక సంస్థ మేనేజర్ బొమ్మిడి శ్రీనివాసరావు సిబ్బందితో కలసి వెంకయ్య గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించారు.