స్వర్గీయ పింగళి వెంకయ్యకు జాతీయ స్థాయి గుర్తింపు రావాలి…

-స్పందన సమావేశ మందిరానికి కీర్తిశేషులు పింగళి వెంకయ్య నామకరణం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ పతాక రూపకర్త కీర్తీశేషులు స్వర్గీయ పింగళి వెంకయ్యకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావలసిన అవసరం ఉందని అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ద్వారా ఆయన ఘన కీర్తిని చాటిచెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.
అజాదీ కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ పింగళి వెంకయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టర్‌రేట్‌లోని స్పందన సమావేశ మందిరానికి పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంగా నామకరణం చేస్తూ శిలపలకాన్ని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌, శాసన మండలి సభ్యులు కె. ఎస్‌ లక్ష్మణ్‌రావులు ఆవిష్కరించారు. అనంతరం మీడియో ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప దేశ భక్తుడని జాతీయ పతాకం ఉండాలని కోరుకునేవారిలో ఒకరని అన్నారు. ఆయన దేశ భక్తుడే కాక వ్యవసాయ పారిశ్రామిక పరిశోదన రంగాలపై విశేష ఆసక్తి కలిగిన వ్యక్తి అని అన్నారు. బావితరాలకు స్పూర్తి ప్రాధాత అయిన పింగళి వెంకయ్యను సర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 19 సంవత్సరాల వయసులో దక్షణాఫ్రికాలో జరుగుతున్న బోయర్‌ యుద్దంలో ఉత్సహాంగా పాల్గొన్నారని అప్పుడే మహాత్మాగాంధీతో కలవడం జరిగిందన్నారు. 1916లో భారత దేశానికి జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో వ్రాసి ప్రచురించారన్నారు. 1906 సంవత్సరం నుండి 1922 వరకు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారని వందేమాతరం హోమ్‌రూల్‌ ఉద్యమం ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ద ఉద్యమాలలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. బెంగూళూరు మద్రాస్‌లో రైల్వే గార్డుగా పనిచేశారని కొంత కాలం బళ్లారిలో ప్లేగు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఆయన దేశ భక్తి తో స్వాతంత్య్ర స్పూర్తితో ఉద్యమంలో అడుగులు కలిపారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పింగళి వెంకయ్య ఏనలేని సేవలు అందించారని అన్నారు. దేశానికి వన్నె తీసుకువచ్చే విధంగా మువ్వెన్నల పతాకాన్ని రూపొందించి దేశం గర్వించదగ్గ వ్యక్తిగానిలిచారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి గురించి దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పింగళివెంకయ్య సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించడం అభినందనీయమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆశువులు బాసిన నాటి త్యాగధనులను స్మరించుకునే విధంగా నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్‌ మహోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాలలో జాతీయ పతాక కర్తలను ఎంతగానే గౌరవిస్తారనే అదేవిధమైన గౌరవాన్ని పింగళి వెంకయ్యకు కల్పించాలన్నారు. జాతీయ పతాకం ఆవిష్కరించి స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య నిరాడంబరమైన నిస్వార్ధమైన జీవితం గడిపి నేటి యువతకు స్పూర్తిదాయకంగా నిలిచారన్నారు. నేటి నుండి ఆగస్టు 15వ తేదీ వరకు జిల్లాలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 13,14,15 తేదీలలో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకం ఎగర వేసేలా ప్రజలను చైతన్యవంతులను చేసి పింగళి వెంకయ్య సేవలను ప్రజలు గుర్తించుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని గ్రామ వార్డు సచివాలయాలు మండల జిల్లా కార్యలయాలలో పింగళి వెంకయ్య జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించేలా ఆదేశించామని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
శాసన మండలి సభ్యులు కె. ఎస్‌ లక్ష్మణ్‌ రావు మాట్లాడుతూ స్వర్గీయ పింగళి వెంకయ్య కృష్ణాజిల్లాకు చెందిన వారు కావడం మన అందరికి గర్వకారణం అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో గాంధీజి దక్షణాఫ్రికా నుండి వచ్చి ఉద్యమంలో పాల్గొనక ముందే పింగళి వెంకయ్య ఉద్యమ స్పూర్తిని నింపుకున్నారన్నారు. 1907లో వందేమాతరం ఉద్యమంలో బిపిన్‌ చంద్రపాల్‌ రాష్ట్రంలోని రాజమండ్రి కాకినాడ, గుంటూరు, విజయవాడలో పర్యటించారని ఆ సమయంలో రాజమండ్రిలో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో పింగళి వెంకయ్య పాల్గొన్నారని గుర్తు చేశారు. 1947 జూలై 22వ తేదీన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని భారత జాతీయ జెండాగా గుర్తించి ఆమోదించడం జరిగిందన్నారు. నాటి నుండి గ్రామ సచివాయం మొదలుకుని అత్యున్నతమైన పార్లమెంట్‌ భవనం ఎర్రకోట శాసనసభ శాసనమండలి వంటి పరిపాలన భవనాలతో ప్రతీ కార్యాలయంపైన జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు.
తొలుత పింగళి వెంకయ్య చిత్రపాఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పింగళి వెంకయ్య సమావేశ మందిరం ఆవరణంలో ఇండియా మ్యాప్‌ స్వాతంత్య్ర సమరయోదులైన గాంధీజీ, భగత్‌సింగ్‌ రaన్సీలక్ష్మిబాయ్‌, అల్లూరి సీతారామరాజు, చిత్రపాటాలతో పాటు అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ బ్యానర్‌ వద్ద సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో ఇంతియాజ్‌ భాషా, యువజన సంక్షేమ అధికారి శ్రీనివాస్‌రావు, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పి వి రమేష్‌కుమార్‌, ఉద్యాన అధికారి బాలజీ కుమార్‌, సర్వే ఎడి కె. సూర్యరావు, కలెక్టరేట్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *