-బళ్లారి రాఘవ నాటక రంగానికి అందించిన సేవలు మరువలేనివి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య రూపొందించిన పతాకం జాతీయ వాదానికి ప్రతీక అని కీర్తిశేషులు బళ్లారి రాఘవ నాటక రంగానికి అందించిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మంగళవారం బాపు మ్యూజియంలో నిర్వహించిన పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవల జన్మదిన వేడుకలలో పాల్గొని వారి కాంస్య విగ్రహాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మల్లాధి విష్ణువర్థన్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పతాకం రూపొందించడంలో పింగళి వెంకయ్య జాతీయ వాదం ఉట్టిపడేలా రూపకల్పన చేశారన్నారు. జాతీయ జెండాలో కాషాయం హిందువులకు ఆకుపచ్చ ముస్లీమ్‌లకు తెలుపు క్రైస్తవులకు చిహ్నంగా గుర్తిస్తారన్నారు. సర్వమతాలకు ప్రాధాన్యత కల్పిస్తూ త్రివర్ణపతాకం రూపొందించడం జాతీయ వాదానికి నిదర్శనం అన్నారు. మధ్యలో ఉన్న అశోకు ధర్మ చక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం అన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జీవితాంతం దేశం కోసం స్వాతంత్య్రం కొరకు పోరాడిన పింగళి వెంకయ్య నేటి యువతకు స్పూర్తిదాయంకంగా నిలుస్తారన్నారు. ప్రముఖ నాటక రంగ రచయిత బళ్లారి రాఘవ నాటక రంగానికి ఎనలేని సేవలందించారన్నారు. సత్య హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి బృహన్నల రామరాజు చరిత్ర రామదాసు తప్పెవరిది సరిపడని సంగతులు వంటి నాటకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయన్నారు. భారతీయ నాటకాలు కళలు గురించి మన దేశంలోనే కాక ఇంగ్లాండు, అమెరికా వంటి దేశాలలో ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. మహాత్మాగాంధీ రవీంద్రనాధ్ ఠగూర్, జార్జి బెర్నార్డ్ షా వంటి ప్రముఖలు బళ్లారి రాఘవ నాటకాలను ప్రశంసించారన్నారు. స్త్రీలను నాటక రంగంలో ప్రోత్సహించి ప్రసిద్ద రంగ స్థల నాటక మణులుగా తీర్చిద్దిన మహోన్నత వ్యక్తి బళ్లారి రాఘవను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ గతంలో విక్టోరియా మ్యూజియం నేటి బాపు మ్యూజియం ప్రాంగణంలో 1921 మార్చి 31వ తేదీన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశానికి బాబూరాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లబాయ్పటెల్, ఆయ్యదేవర కాళేశ్వరరావు వంటి ఎందరో జాతీయ నాయకులు హాజరయారన్నారు. సమావేశంలో జాతీయ జెండా ఆవశ్యకత పై చర్చించారన్నారు. పింగళి వెంకయ్య ముందుకు వచ్చి జాతీయ జెండాను రూపకల్పన చేశారన్నారు. భారత దేశ ఆత్మగౌరవం, కీర్తి ప్రతిష్టలను ఇనుమడిరప చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య అని అన్నారు. ఈయన వ్యవసాయ శాస్త్రవేత్తగానే కాకుండా వైద్యునిగా ఎన్నో సేవలు అందించారని శాసనసభ్యులు అన్నారు.
యూత్ అడ్వాన్స్మెంట్అండ్ స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ మాట్లాడుతూ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ప్రముఖ నాటక రంగ రచయిత బళ్లారి రాఘవ స్వాతంత్య్రయోద్యమ త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. 1921 సంవత్సరంలో ఇదే ప్రాంగణంలో పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించి మహాత్మాగాంధీకి చూపించడం జరిగిందన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్ని కార్యక్రమాలను విజయంతం చేయాలని వాణిమోహన్ కోరారు.
తొలుత విద్యార్థులు పదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్వో కె. మోహన్‌కుమార్, భట్రాజ్ శాసన మండలి సభ్యులు టి. కల్పలత రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కూరపాటి గీతాజంలిదేవి,మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షెర్ ఆసిఫ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ టి. జమలపూర్ణమ్మ తదితరులు ఉన్నారు.