Breaking News

పారిశ్రామిక వాడల్లో ఎమ్ ఎస్ ఎమ్ ఇ యూనిట్ లకు రూ. 1900 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యం…

-రైతులకు, మహిళా సంఘాలకు ఇతోధికంగా రుణాలు అందిస్తున్నాం..
-” యూనియన్ నారీ శక్తి ” పధకం ద్వారా ఔత్సహిక మహిళలకు రూ. 10 లక్షల రూపాయల నుండి రూ. 10 కోట్ల వరకూ రుణాలు అందిస్తున్నాం..
-యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా అమలు చేస్తున్న పధకాలను వివరించిన చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానంద రెడ్డి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు, వ్యాపారస్తులకు, పారిశ్రామిక యూనిట్ లకు, వివిధ వృత్తులకు, మహిళలకు యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా ఇతోధికంగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నదని చీఫ్ జనరల్ మేనేజర్ మరియు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్ యు. బ్రహ్మానంద రెడ్డి అన్నారు. విజయవాడ వన్ టౌన్ లోని యూనియన్ బ్యాంకు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బ్యాంకు అమలు చేస్తున్న వివిధ పధకాల గురించి అయన వివరించారు. ఈసందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య అకాల వర్షాలు, తుఫాన్, కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వ్యవసాయరంగం, వ్యాపార, ఇతర రంగాలకు చేయూతను ఇస్తూ వారి అభివృద్ధికి యూనియన్ బ్యాంకు కృషి చేస్తున్నదని ఇందులో భాగంగా అనేక పధకాలను అమలు చేయడం ద్వారా ఇతోధికంగా రుణ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా సాధికారిత కొరకు వివిధ రంగాలలో 50 శాతం వరకు మహిళలకు రుణ సదుపాయం కల్పించేందుకు ” యూనియన్ నారీ శక్తి ” అనే పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఔత్సాహికులైన మహిళలకు 10 లక్షల నుండి 10 కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నామని, 2 కోట్ల వరకు ఎలాంటి హామీ పూచీకత్తు లేకుండా రుణాలు అందిస్తున్నామన్నారు. ” యూనియన్ ఉమెన్ ప్రొఫెషనల్ లోన్స్ ” పధకం క్రింద వివిధ వృత్తుల్లో గల మహిళలకు 50 లక్షల వరకూ ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా తక్షణం రుణాలు అందిస్తున్నామన్నారు. ” ఆయుష్మాన్ ప్లస్ ” పధకం క్రింద ఆసుపత్రుల నిర్మాణానికి వైద్య వసతులు, వైద్య సౌకర్యాల కల్పనకు డాక్టర్స్ కు, వైద్య రంగానికి చెందిన వారికీ 100 కోట్ల వరకూ రుణ సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు ” యూనియన్ కిసాన్ కామధేను గోల్డ్ లోన్ ” పధకం క్రింద 5 లక్షల వరకూ వ్యవసాయ సంబంధ గోల్డ్ లోన్స్ ను అందిస్తున్నామన్నారు. ” కిసాన్ తత్కాల్ పధకం ” క్రింద 50 వేల వరకు పంట రుణాలు అందిస్తున్నామన్నారు. పంటల అభివృద్ధికి పశు, మత్స్య రంగాల అభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు అందిస్తున్నామని దీని ద్వారా 50 వేల వరకూ నగదు బదిలీ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ” యూనియన్ ఫార్మ్ ట్రాన్స్ పోర్ట్ పధకం ” క్రింద రైతులకు టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు తక్కువ వడ్డీపై రుణాలు అందిస్తున్నామన్నారు. ” యూనియన్ ఎమ్ ఎస్ ఎమ్ ఇ సువిధ పధకం ” క్రింద సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి 50 కోట్ల వరకూ రుణసదుపాయం కల్పిస్తున్నామన్నారు. పారిశ్రామిక వాడల్లో ఎమ్ ఎస్ ఎమ్ ఇ యూనిట్ లకు తక్షణ రుణ సదుపాయం కోసం యూనియన్ బ్యాంకు 1900 కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. ” శిశు ముద్ర ఎస్ టి పి ” డిజిటల్ లోన్ పధకం క్రింద డిజిటల్ మాధ్యమం (లోన్ యాప్) ద్వారా 50 వేలరూపాయల వరకూ ముద్ర లోన్ పొందవచ్చునన్నారు. ” యూనియన్ అగ్రి ఇన్ఫ్రా స్ట్రక్చర్ స్కీం ” క్రింద వ్యవసాయ గోదాములు, శీతల గిడ్డంగులు, మరియు ఇతర వ్యవసాయ సంబంధమైన కట్టడాలకు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు 3% వడ్డీ రాయితీతో రెండు కోట్ల వరకూ కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యం అందిస్తున్నదన్నారు. డ్వాక్రా మహిళలకు 20 లక్షల వరకూ ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణసౌకర్యం అందిస్తున్నామని డ్వాక్రామ మహిళలకు వ్యక్తిగత రుణాలు క్రింద ఎటువంటి హామీ లేకుండా 10 లక్షల వరకూ రుణ సౌకర్యం అందిస్తామన్నారు. వివిధ రంగాలు, వివిధ వర్గాల ప్రజలు ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా ఇతోధికంగా రుణ సౌకర్యాలు కల్పిస్తున్నదని బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *