-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి అవాస యోజన గ్రామీణ్ లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికేట్లు మంజూరు ఇ-రిజిస్ట్రేషన్ల లక్ష్యాల సాదనలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోక తప్పదని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను హెచ్చరించారు.
పియంఎవై గ్రామీణ్ రిజిస్ట్రేషన్‌లలో పేదలకు మంజూరైన గృహాల ఇ-రిజిస్ట్రేషన్ ప్రక్రియపై మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ఆయన కార్యాలయం నుండి హౌసింగ్ అధికారులతో జూమ్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి అవాస యోజన గ్రామీణ్ లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికేట్లు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 4,032 మంది లబ్దిదారులకు గాను ఇప్పటివరకు 2,112 మందికి మాత్రమే పొజిషన్ సర్టిఫికేట్లను అందించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్ ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. హౌసింగ్ ఏఇలు విలేజ్ రెవెన్యూ అధికారులు విలేజ్ సర్వే అధికారులు సంయుంక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ వారంతంలోపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో మండల అసిస్టెంట్ ఇంజనీర్లను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నవరత్నాలు, పేదలందరికి ఇళ్లు పథకం ద్వారా జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న గృహాల ఇ- రిజిస్ట్రేషన్లకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న లబ్దిదారుల వివరాలను ఇ-రిజిస్ట్రేషన్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 83,633 ఇ-రిజిస్ట్రేషన్లకు సంబంధించి 76,800 ఇ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. జగ్గయ్యపేట డివిజన్ పరిధిలో 1500, నందిగామ డివిజన్ పరిధిలో 1500, మైలవరం డివిజన్ పరిధిలో 1900, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలో 921, తూర్పు నియోజకవర్గంలో 291, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 1195 ఇ-రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేయవలసి ఉందన్నారు. గృహ నిర్మాణ అధికారులు పెండిరగ్ ఇ-రిజిస్ట్రేషన్లను మున్సిపల్ కమీషనర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మిగిలిన డివిజన్‌లకు సంబంధించి సంబంధిత తహాశీల్థార్లు, ఆర్‌డివోలు, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు. జగనన్న కాలనీలలో తాత్కాలిక మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను త్వరలో పూర్తి చేయాలని చేపట్టవలసిన పనులకు టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియలను పూర్తి చేసి ఆగస్టు 20వ తేదీ నాటికి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించి గృహ నిర్మాణశాఖాధికారులు జగనన్న కాలనీలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, హౌసింగ్ పిడి ఏ. శ్రీదేవి, ఇఇ రవికాంత్, జిల్లాకు చెందిన డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.