రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్టోరల్ రోల్‌లో పేరు ఉన్న ప్రస్తుత ఓటర్లు అతని/ఆమె ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా తెలియజేయవచ్చునని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నందు జిల్లా అధికారులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు, గుర్తింపు ప్రక్రియ లో భాగంగా డిజిటలైజేషన్ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలలోని ఓటరు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, ఇతర ఫోటో గుర్తింపు కార్డు తో వారి ఓటరు గుర్తింపు ను అనుసంధానం చేసే విధానం లో సహకరించాలని కోరారు. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కోసం గోడ ప్రతుల ద్వారా ప్రచారం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అధికారులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటరు కార్డు ఆధార్ తో అనుసంధానం పూర్తిగా స్వచ్ఛందంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …