విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి తావులేని సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా పాలన సాగిస్తున్నారు అని,రాష్ట్ర చరిత్రలో సువర్ణధ్యాయం జగనన్న పాలన అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 32వ సచివాలయ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ 5వ లైన్ నుండి మొదలై అప్పలనాయుడు వీధులలో మెట్రో ఎదురుగా ఉన్న కొండప్రాంత చివరంచు ఇంటి ఇంటి వరకు పర్యటించి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేనివిధంగా జగన్ వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి కులమత పార్టీలకటితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం లో ఏదైనా సంక్షేమ లబ్ది కావాలంటే కార్యాలయల చుట్టూ కాల్లారిగెల తిరిగి, అర్హత ఉన్న సరే జన్మభూమి కమిటీ లకు లంచాలు ఇస్తే గాని వచ్చే పరిస్థితి ఉండేది కాదని విమర్శించారు. ప్రజలలో రోజురోజుకు జగన్ మీద పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు వారి రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని,వాటిని తిప్పికొడుతూ ప్రజలకు అర్థమయ్యేలా వాస్తవాలను వివరించడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అందుకు నిదర్శనమే వైసీపీ నాయకుల కు బ్రహ్మరథం పడుతూ ప్రజలు స్వాగతం పలకడమే అని అన్నారు. గతంలో ఎవరు కూడా మా కొండ ప్రాంత వాసుల దగ్గరకు వచ్చేవారు కాదని మాకు అసలు ఏ సంక్షేమ పథకాలు అందేవి కాదని కానీ నేడు జగనన్న వచ్చాక వలంటీర్ లు ఇంటికే వచ్చి పెన్షన్లు,సంక్షేమ పధకాలు అందజేస్తున్నారు అని ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.టీడీపీ నాయకులు వారి వైఖరి మార్చుకోకుండా ఇలానే చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అవినాష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జడా తేజేష్,వైస్సార్సీపీ నాయకులు పాటిబండ్ల హరీష్,అబ్బినాయుడు,సిమెంట్ ప్రసాద్,రాజా మరియు స్థానిక నాయకులు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …