Breaking News

దేశభక్తీ గీతాల ఆలాపన కార్యక్రమం…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
అమృత మహోత్సవం హర్ ఘర్ తిరంగా 4వ రోజులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఎన్.టి.ఆర్. క్రీడా ప్రాంగణంలో గురువారం దేశభక్తీ గీతాల ఆలాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు.
కార్యక్రమంలో మిరియాల శ్రీనివాసరావు కళాజాత బృందం దేశభక్తీ మరియు స్వాతంత్ర్య పోరాట యోధుల వీర గాధల పై ప్రత్యేక పాటలను ఆలపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు, నగర కమిషనర్ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ ఈ నెల 1 నుండి 15 వరకు ప్రతి రోజు దేశ భక్తీ సంబధించిన అంశాల పై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) డి.శ్రీనివాసరావు తెలిపారు. నగరపాలక సంస్థ పాఠశాలల్లో కూడా విద్యార్ధులకు దేశభక్తీ గీతాలపై పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అమృత మహోత్సవం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో నగర ప్రజలు పాల్గొని దేశం కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవాలని కోరారు.
కార్యక్రమములో నగర పాలక సంస్ధ అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) డి.శ్రీనివాసరావు, వివిధ విభాగాల సూపరిండెంట్లు, ఎన్.సి.సి. క్యాడేట్స్ తదితరులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *