Breaking News

బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించాలి

– భక్తుల కోసం తిరుమల ,అలిపిరిలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు
– అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
– రద్దీకి తగ్గట్టు పగడ్బందీ ఏర్పాట్లు
-టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తుండటం ,పెరటాశి మాసం రావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు. తిరుమల, అలిపిరి లో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు.

అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం చైర్మన్ సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి తో కలసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష జరిపారు . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు . ఆవివరాలు ఇవీ ….

– సెప్టెంబ‌రు 26న‌ అంకురార్ప‌ణ. అదేవిధంగా, సెప్టెంబ‌రు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం.

– తొలిరోజైన‌ సెప్టెంబర్ 27న సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్ప‌ణ‌.

– బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వ‌ర్ణ‌ర‌థం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం.

– తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నసేవ. మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు.

– క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు.

– సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే అమ‌లు. ఆర్జిత సేవ‌లు, శ్రీ‌వాణి, విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.

– పెర‌టాసి మాసం. రెండో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో ర‌ద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు. భక్తులకు విరివిగా అన్న ప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు .

– భక్తుల రద్దీకి తగ్గట్టు ప్ర‌తిరోజూ 9 ల‌క్ష‌ల లడ్డూల బ‌ఫ‌ర్ స్టాక్.

భ‌ద్ర‌త : సెక్యూరిటీ, పోలీసుల స‌మ‌న్వ‌యంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్ర‌ణ, పార్కింగ్‌ ఏర్పాట్లు. వాహనాల పార్కింగ్ మొత్తం రింగ్ రోడ్డులో చేసి , భక్తులను ఉచిత బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు .

– 24/7 కంట్రోల్ రూమ్‌, సిసి కెమెరాలతో నిఘా.

ఇంజినీరింగ్ : గ్యాల‌రీలు, క్యూలైన్లు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు స‌కాలంలో పూర్తి.

– అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ప్ర‌త్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం.

– నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా. జ‌న‌రేట‌ర్లు సిద్ధం.

– శ్రీ‌వారి ఆల‌యం, అన్ని ముఖ్య కూడ‌ళ్ల‌లో ఆక‌ట్టుకునేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు.

ప్ర‌జాసంబంధాల విభాగం : 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు

ఆరోగ్య విభాగం : ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు.

వైద్య విభాగం :. తిరుమల తో పాటు అలిపిరి , తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు, ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, 10 ప్రత్యేక అంబులెన్సుల ఏర్పాటు.

ర‌వాణా : ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులు. గ‌రుడ‌సేవ రోజున ఎక్కువ బ‌స్సులు.

– తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల నిషేధం. కొండ మీద వాహనాల రద్దీ ని బట్టి అవసరమైతే అలిపిరిలో వాహనాల నియంత్రణ .
హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ : శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ముందు విభిన్న క‌ళారూపాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ఏర్పాటు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల కళాకారులకు అవకాశం.

జెఈవో లు సదా భార్గవి,  వీర బ్రహ్మం , సివి ఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సి ఈవో షణ్ముఖ కుమార్ , అదనపు ఎస్పీ లు  కులశేఖర్, విమల కుమారి , డిప్యూటీ ఈవో లు  హరీంద్ర నాథ్. శ్రీ రమేష్ బాబు, వి జి వో బాలిరెడ్డి తో పాటు డిఎస్పీలు , సి ఐ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *