గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ వైస్ ఛాన్స్లర్,ప్రముఖ వైద్యులు, మానవతావాది డాక్టర్ కే.రాజా రామ్ మోహనరావు శత జయంతి వేడుకలను గుంటూరు నగరంలో సెప్టెంబర్ 25వ తేదీన నిర్వహించాలని ఈనెల 5వ తేదీన గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హాలులో జరిగిన ఆహ్వాన సంఘ సమావేశంలో నిర్ణయించారు.ఈ సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.ప్రముఖ రాజ నీతిజ్ఞుడు,వ్యవసాయ రంగ నిపుణులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ ప్రొ. ఉమా రెడ్డి వెంకటేశ్వర్లు ఆహ్వాన సంఘ చైర్మన్ గా, వివిధ రాజకీయ పార్టీల నేతలు,విద్యార్థి,ఉపాధ్యాయ,వైద్య అధ్యాపక సంఘ నేతలు,వివిధ ప్రజా సంఘాల మరియు స్వచ్ఛంద సంస్థల నేతలను ఆహ్వాన సంఘ సభ్యులుగా సమావేశం ప్రకటించింది.ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొ. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ గొప్ప పరిపాలన దక్షుడు,ప్రముఖ వైద్యులు మంచి విలువలతో తన జీవితాన్ని సార్థకం చేసుకున్న కీ.శే.డా. కే.ఆర్.ఆర్ మోహనరావు శత జయంతి వేడుకలను గుంటూరు నగరంలో రాజకీయాలకు అతీతంగా జరప తలపెట్టడం హర్షణియమన్నారు. మంచి వ్యక్తుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని కీ.శే.డా”కే.ఆర్.ఆర్ మోహనరావు శత జయంతి సభలో వారి జీవిత చరిత్రను ప్రచురించి ఆవిష్కరించాలని కోరారు. శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ నాగార్జున విశ్వవిద్యాలయాన్ని బాగా అభివృద్ధి చేసిన కీ.శే.డా”కే.ఆర్.ఆర్ మోహనరావును స్మరించుకోవటం అభినందనీయమన్నారు.సభకు అధ్యక్షత వహించిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ 1937లో ఇచ్చాపురం నుండి తడ వరకు రైతు యాత్రను నిర్వహించిన కీ.శే కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తి చిరస్మరణీయుడని వారి అడుగుజాడల్లో వారి కుమారుడు కీ.శే.డా”కే.ఆర్.ఆర్ మోహనరావు జీవితాంతం నడిచారని గుర్తు చేశారు.గుంటూరు మెడికల్ కళాశాల,సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గాను,సింగరేణి క్యాలరీస్ వైద్య అధికారిగా ఉత్తమ వైద్య సేవలు అందించి ప్రజల మన్నలను కీ.శే.డా.కే.ఆర్.ఆర్ మోహనరావు పొందారన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య ప్రసంగిస్తూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ లలో అత్యధిక ప్రజాదారణ పొందిన మహా మనీషి కీ.శే.డా.కే.ఆర్.ఆర్ మోహనరావు అని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యాప్రదాత బండి అశోక్ రెడ్డి,మహాత్మా గాంధీ కాలేజీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ డి.ఏ.ఆర్ సుబ్రహ్మణ్యం,అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి,ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్,ప్రముఖ సాహితీవేత్తలు ప్రొ”షేక్.మస్తాన్, డా”వి.సింగయ్య,చరిత్ర అధ్యాపకులు డాక్టర్ పాలేరు పోతురాజు,మానవతా కో-కన్వీనర్ సలీం మాలిక్, జన చైతన్య వేదిక కార్యదర్శి కంది పున్నారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …