అండర్ గ్రౌండ్ డ్రెయినేజి మరియు మ్యాన్ హోల్ నుండి సిల్ట్ తొలగించు యంత్రముల పనితీరు పరిశీలన…

-అధికారులకు పలు సూచనలు – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం లబ్బీపేట, డి.వి.మ్యానర్ పరిసర ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణకు సంబంధించిన ఎయిర్ టేక్ మిషన్ మరియు మ్యాన్ హోల్ డిసిల్టింగ్ మిషన్ల ద్వారా మ్యాన్ హోల్స్ నందలి సిల్ట్ మరియు వ్యర్ధములను తొలగించు విధానము, యంత్రముల యొక్క పని తీరును పరిశీలించారు. ఈ సందర్బంలో నివాసాలు లేదా వ్యాపార సంస్థల వారు తమ యొక్క వాడుకపు నీటిని నేరుగా యు.జీ.డికి కాకుండా చిన్న సంపు ఏర్పాటు చేసుకొని దాని నుండి మాత్రమే యు.జీ.డి కి అనుసందానం చేయాలని మరియు సూచించారు. యు.సి.డి నుండి వ్యర్ధములను తొలగించిన అక్కడ వదిలివేయుకుండా నేరుగా వాహనముల ద్వారా తరలించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉండునట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తదుపరి బెంజి సర్కిల్ నుండి రామవరప్పాడు వరకు గల జాతీయ రహదారి నందలి గ్రీన్ బెల్ట్ మరియు సెంట్రల్ డివైడర్ లలో మొక్కలను పరిశీలించి సెంట్రల్ డివైడర్ నందలి ఖాళిగా ఉన్న చోట్ల మొక్కలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించాలని మరియు ఇంపుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేయుటతో పాటుగా పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఉండునట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజీవ్ గాంధీ పార్క్ నందు తుది దశలో ఉన్న ప్రవేశ ద్వారం మరియు పార్క్ నందలి చేపట్టిన వివిధ ఆధునీకరణ పనులను పరిశీలిస్తూ, చేపట్టిన ఆధునీకరణ పనులు అన్నియు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పర్యటనలో సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, డిప్యూటీ ఇంజనీర్ యేసుపాదం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *